Congress BRS: ఆగమేఘాల మీద అనిల్ విషయంలో ఇలా ఎందుకు జరిగిందంటే..!

ABN , First Publish Date - 2023-09-26T03:25:16+05:30 IST

కాంగ్రె్‌సలో చేరికల దూకుడు కొనసాగుతోంది. బీఆర్‌ఎస్‌, బీజేపీలో అసంతృప్త నాయకులే లక్ష్యంగా రాష్ట్ర నాయకత్వం వేగం పెంచింది. ఒకే రోజు అటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. ఇటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రంగంలోకి దిగి కీలకమైన ఇద్దరు బీఆర్‌ఎస్‌ నేతలను కాంగ్రెలోకి ఆహ్వానించారు. సోమవారం ఉదయం..

Congress BRS: ఆగమేఘాల మీద అనిల్ విషయంలో ఇలా ఎందుకు జరిగిందంటే..!

  • కాంగ్రెస్‌లోకి జోరుగా వలసలు.. సొంత గూటికి కుంభం అనిల్‌కుమార్‌

  • బీఆర్‌ఎస్‌లో చేరిన రెండు నెలల్లోనే వెనక్కి

  • ఇంటికెళ్లి పార్టీ కండువా కప్పిన రేవంత్‌రెడ్డి

  • మైనంపల్లి నివాసానికి వెళ్లి ఆహ్వానించిన భట్టి

  • రేపు కాంగ్రెస్‌లో చేరుతానన్న హన్మంతరావు

  • వారంలోగా హస్తం గూటికి ఎమ్మెల్సీ కసిరెడ్డి

  • మరికొందరు బీఆర్‌ఎస్‌ నేతలూ చేరే చాన్స్‌

  • టచ్‌లోకి బోథ్‌, ఉప్పల్‌ సిటింగ్‌ ఎమ్మెల్యేలు

  • ఉమ్మడి వరంగల్‌కు చెందిన ఓ నేత కూడా..

  • బీజేపీలోని అసంతృప్త నేతలకూ ‘హస్తం’ వల

  • కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో చర్చలు?

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌) : కాంగ్రె్‌సలో చేరికల దూకుడు కొనసాగుతోంది. బీఆర్‌ఎస్‌, బీజేపీలో అసంతృప్త నాయకులే లక్ష్యంగా రాష్ట్ర నాయకత్వం వేగం పెంచింది. ఒకే రోజు అటు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. ఇటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రంగంలోకి దిగి కీలకమైన ఇద్దరు బీఆర్‌ఎస్‌ నేతలను కాంగ్రెలోకి ఆహ్వానించారు. సోమవారం ఉదయం.. మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు నివాసానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వెళ్లారు. కాంగ్రె్‌సలోకి రావాలని ఆయన్ను ఆహ్వానించారు. అనంతరం మైనంపల్లి మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 27న కాంగ్రె్‌సలో చేరనున్నట్లు స్వయంగా ప్రకటించారు. ఆయన కుమారుడు మైనంపల్లి రోహిత్‌, నక్కా ప్రభాకర్‌గౌడ్‌తోపాటు మరికొందరు బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లతో కలిసి ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలిసింది.

మరోవైపు... రెండు నెలల కిందటే బీఆర్‌ఎ్‌సలో చేరిన కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి మళ్లీ సొంతగూటికి చేరుకున్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో విభేధాల కారణంగా గత జూలై 25న అనిల్‌కుమార్‌రెడ్డి.. బీఆర్‌ఎ్‌సలో చేరిన విషయం తెలిసిందే. అయితే సిటింగ్‌కే కేసీఆర్‌ సీటు ఇవ్వడంతో అనిల్‌కుమార్‌రెడ్డి ఆశించిన భువనగిరి సీటు దక్కలేదు. దీంతో అసంతృప్తిగా ఉన్న అనిల్‌కుమార్‌రెడ్డితో కాంగ్రెస్‌ వ్యూహకర్త సునీల్‌ కనుగోలు, రేవంత్‌రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌ చర్చలు జరిపారు. తిరిగి పార్టీలో చేరేందుకు అనిల్‌కుమార్‌రెడ్డి సుముఖత వ్యక్తం చేయడంతో సోమవారం రేవంత్‌రెడ్డి ఆయన నివాసానికి వెళ్లి లాంఛనంగా ఆహ్వానించారు. అప్పటికప్పుడే కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలో చేర్చుకున్నారు. ఇదిలా ఉండగా, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి కాంగ్రె్‌సలో చేరేందుకు సర్వం సిద్ధమైంది. వారంలోగా ఆయన కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి టీపీసీసీ ముఖ్య నేతలు, కసిరెడ్డి మధ్య సోమవారం చర్చలు జరిగాయి. ఆయనతోపాటు నాగర్‌కర్నూల్‌ జడ్పీ వైస్‌ చైర్మన్‌ ఠాకూర్‌ బాలాజీసింగ్‌, మరో నలుగురు జడ్పీటీసీ సభ్యులు కూడా హస్తం గూటికి చేరన్నట్లు తెలుస్తోంది. జనరల్‌ కోటాలో అయితే కసిరెడ్డి నారాయణరెడ్డికి, బీసీ కోటాలో అయితే తనకు కేటాయించాలని బాలాజీసింగ్‌ షరతు విధించగా.. సానుకూల స్పందన వచ్చినట్లు తెలిసింది.

ఈ వారంలోనే మరిన్ని చేరికలు

బీఆర్‌ఎస్‌, బీజేపీ నుంచి ఈ వారంలోనే మరింత మంది కాంగ్రె్‌సలో చేరనున్నట్లు గాంధీభవన్‌ వర్గాలు తెలిపాయి. బీఆర్‌ఎ్‌సకు చెందిన బోథ్‌, ఉప్పల్‌ ఎమ్మెల్యేలు రాథోడ్‌బాపూరావు, భేతి సుభా్‌షరెడ్డి కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ ఇప్పటికే కాంగ్రెస్‌ పెద్దలను కలిసిన సంగతి తెలిసిందే. బీఆర్‌ఎస్‌ నేత, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం ఒకటి, రెండు రోజుల్లో హస్తం గూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన బీఆర్‌ఎస్‌ ఓ అసంతృప్త నేత కూడా కాంగ్రె్‌సతో టచ్‌లో ఉన్నారని సమాచారం. అలాగే, బీఆర్‌ఎస్‌ పట్ల బీజేపీ వైఖరితో అసంతృప్తిగా ఉన్న ఆ పార్టీ ముఖ్య నేతలతోనూ కాంగ్రెస్‌ అధిష్ఠానం సంప్రదింపులు చేస్తున్నట్లు చెబుతున్నారు. ఎల్బీనగర్‌, మునుగోడు సీట్లలో ఏదో ఒకటి ఇస్తామన్న ప్రతిపాదన రాజగోపాల్‌రెడ్డి ముందు ఉంచిట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే, బీజేపీకే చెందిన మాజీ ఎంపీలు, మాజీఎమ్మెల్యే ఒకరితో పార్టీ అధిష్ఠానం సంప్రదింపులు జరుపుతున్నట్లు చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ వారంలో భారీగానే చేరికలు ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాగా, మైనంపల్లికి మల్కాజిగిరి టికెట్‌ ఇస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో డీసీసీ అధ్యక్షుడు నందికంటి శ్రీధర్‌తో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, వీహెచ్‌, మల్లురవి తదితరులు భేటీ అయ్యారు. అనంతరం మధుయాష్కీ మాట్లాడుతూ పార్టీని నమ్ముకుని ఉన్న వారికి సరైన ప్రాధాన్యం కల్పిస్తామన్నారు. కాంగ్రెస్‌ స్ర్కీనింగ్‌ కమిటీ సమావేశం తర్వాతే టికెట్లపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు.

Updated Date - 2023-09-26T12:31:45+05:30 IST