Delhi: నేడు, రేపు కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ

ABN , First Publish Date - 2023-09-20T12:22:22+05:30 IST

న్యూఢిల్లీ: కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ బుధ, గురువారాలు సమావేశం కానుంది. ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది. పార్లమెంట్ సమావేశాల అనంతరం స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనుంది.

Delhi: నేడు, రేపు  కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ భేటీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ (Congress) స్క్రీనింగ్ కమిటీ (Screening Committee) బుధ, గురువారాలు సమావేశం కానుంది. ఢిల్లీలోని ఏఐసీసీ (AICC) కార్యాలయంలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం కానుంది. పార్లమెంట్ సమావేశాల అనంతరం స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఈ భేటీకి స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్, సభ్యులు బాబా సిద్ధికి, జిగ్నేష్ మేవాని, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఎంపీ ఉత్తంకుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్ రావు ఠాక్రే తదితరులు హాజరవుతారు. ప్రదేశ్ ఎన్నికల కమిటీ సిఫారసు చేసిన జాబితాను స్క్రీనింగ్ కమిటీ వడపోయనుంది.

ఇప్పటికే సర్వే నివేదికలను తెప్పించుకున్న స్క్రీనింగ్ కమిటీ.. వడపోత అనంతరం తమ నివేదికను పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీకి సిపారసు చేయనుంది. సింగిల్, డబుల్ నేమ్ ప్రతిపాదనలతోపాటు ముగ్గురు, నలుగురు నాయకులు పోటీపడుతున్నట్లు పీఈసీ ప్రతిపాదనలు చేసింది. సర్వేలు, సామాజిక, స్థానిక రాజకీయ స్థితిగతుల ఆధారంగా చేసుకుని అభ్యర్థులను స్క్రీనింగ్ కమిటీ ఎంపిక చేయనుంది.

Updated Date - 2023-09-20T12:23:34+05:30 IST