CPI Narayana: కేసీఆర్ ఆఫ్ ది రికార్డ్ మాటలను మోదీ బయట పెట్టడం అనైతికం
ABN , First Publish Date - 2023-10-04T16:23:48+05:30 IST
కేసీఆర్ ఆఫ్ ది రికార్డ్ మాటలను బయట పెట్టడం అనైతికం. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటి కాదని చెప్పేందుకే మోదీ తాపత్రయం. ప్రధాని స్థాయి వ్యక్తి దేశానికి అవమానకరంగా మాట్లాడారు. కేసీఆర్ అవినీతిపై మోదీ
హైదరాబాద్: ప్రధాని మోదీ (pm modi) వ్యాఖ్యలు దిగజారుడు తనానికి పరాకాష్ఠ అని సీపీఐ నారాయణ (CPI Narayana) వ్యాఖ్యానించారు. ఏబీఎన్‌తో ఆయన మాట్లాడారు. ‘‘కేసీఆర్ ఆఫ్ ది రికార్డ్ మాటలను బయట పెట్టడం అనైతికం. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటి కాదని చెప్పేందుకే మోదీ తాపత్రయం. ప్రధాని స్థాయి వ్యక్తి దేశానికి అవమానకరంగా మాట్లాడారు. కేసీఆర్ (cm kcr)అవినీతిపై మోదీ సర్కార్ ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు. లిక్కర్ స్కాంలో సిసోడియాను మాత్రమే ఎందుకు అరెస్ట్ చేశారు?, లిక్కర్ స్కాంలో ఉన్న వైసీపీ, బీఆర్ఎస్ మనుషులు సేఫ్‌గా బయట ఉన్నారు. బీఆర్ఎస్, బీజేపీది అండర్ స్టాండింగ్‌తో కూడిన ముద్దులాట, గుద్దులాట. లిక్కర్ కేసులో కవిత జైలుకు వెళ్లలేదంటే.. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటి కాబట్టే. జాతీయ స్థాయి తరహాలోనే తెలంగాణలోనూ కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు కలిస్తే బాగుంటుంది. ఏపీలోనూ టీడీపీ, జనసేనతో కలసి పనిచేసే అంశాన్ని పరిశీలిస్తాం.’’ అని ABNతో సీపీఐ నారాయణ వ్యాఖ్యానించారు.