డెక్కన్ మాల్‌లో ఇంకా పూర్తిగా అదుపులోకి రాని మంటలు

ABN , First Publish Date - 2023-01-20T08:14:50+05:30 IST

డెక్కన్ మాల్‌లో మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. భవనం కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు.

డెక్కన్ మాల్‌లో ఇంకా పూర్తిగా అదుపులోకి రాని మంటలు

సికింద్రాబాద్ : డెక్కన్ మాల్‌లో మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. భవనం కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. భవనం దగ్గరికి అధికారులు ఎవరినీ అనుమతించడం లేదు. నేడు కాలిన భవనాన్ని జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు పరిశీలించనున్నారు. భవనంలోని గోడౌన్‌కు పర్మిషన్ లేదని జీహెచ్ఎంసీ చెబుతోంది. సెల్లార్‌లో చిక్కుకున్న వారిపై ఇంకా స్పష్టత రాలేదు. పరిసర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించనున్నారు. భవన యజమానిపై చర్యలకు అధికారులు సిద్దమవుతున్నారు.

Updated Date - 2023-01-20T08:14:51+05:30 IST