Hyderabad: మాసబ్‌ట్యాంక్‌లో ఆక్రమణల కూల్చివేత..

ABN , First Publish Date - 2023-02-14T10:37:35+05:30 IST

హైదరాబాద్: మాసబ్‌ట్యాంక్‌లో ఆక్రమణల కూల్చివేత కొనసాగుతోంది. జీహెచ్ఎంసీ పార్క్ స్థలాన్ని ఆక్రమించి వెలసిన నిర్మాణాలను బల్దియా అధికారులు కూల్చివేస్తున్నారు.

Hyderabad: మాసబ్‌ట్యాంక్‌లో ఆక్రమణల కూల్చివేత..

హైదరాబాద్: మాసబ్‌ట్యాంక్‌లో ఆక్రమణల కూల్చివేత కొనసాగుతోంది. జీహెచ్ఎంసీ (GHMC) పార్క్ స్థలాన్ని (Park Space) ఆక్రమించి వెలసిన నిర్మాణాలను బల్దియా అధికారులు (Baldia Officials) కూల్చివేస్తున్నారు. బెస్తివాడ బస్తీ వాసులను ఖాళీ చేయిస్తున్నారు. దీంతో అధికారులను బెస్తివాడ వాసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. ఇళ్ల కూ

ల్చివేతతో పలు కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎటూ వెళ్లలేక దిక్కుతోచని స్థితిలో ఉన్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ సుమారు 150కిపైగా నివాసాలు ఉన్నాయి. వాటిని అధికారులు కూల్చివేస్తున్నారు.

దాదాపు 17 ఏళ్ల నుంచి ఇక్కడ నివాసం ఉంటున్నామని తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు రోడ్డుపాలు చేశారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ, రెవెన్యూ, పోలీసు బలగాలతో మంగళవారం తెల్లవారుజాము నుంచి అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. ఈ సందర్భంగా బాధితులు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి (ABN Andhrajythy)తో మాట్లాడుతూ తాము 17 ఏళ్ల నుంచి తాతముత్తాల నుంచి ఇక్కడే నివాసం ఉంటున్నామని తెలిపారు. కరెంట్, వాటర్, ట్యాక్స్.. ప్రభుత్వానికి కట్టాల్సిన అన్నీ బిల్లులు కడుతున్నామని చెప్పారు. అయినా అధికారులు తమకు ప్రత్యామ్నాయం చూపించకుండా నిర్దాక్షిణ్యంగా కట్టుబట్టలతో రోడ్డుపాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు జీహెచ్ఎంసీ అధికారుల వెర్సన్ మరోలా ఉంది. జీహెచ్ఎంసీ పార్క్ స్థలాన్ని ఆక్రమించి గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్నారని, దీనికి సంబంధించి గతంలో నోటీసులు ఇచ్చామని.. అయినా ఎవరూ ఖాళీ చేయకపోవడంతో ఇవాళ గుడిసెలను కూల్చివేస్తున్నామని చెప్పారు. అక్రమ నిర్మాణాలపై కఠినచర్యలు ఉంటామని అధికారులు తెలిపారు. అందులో భాగంగానే ఇవాళ బెస్తివాడలో కూల్చివేతల కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు.

Updated Date - 2023-02-14T10:37:39+05:30 IST