Hyderabad: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు ఒడిశా రైల్ ప్రమాదం ఎఫెక్ట్..
ABN , First Publish Date - 2023-06-04T13:33:47+05:30 IST
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు ఒడిశా కోరమండల్ రైల్ ప్రమాదం ఎఫెక్ట్ తగిలింది. బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం కారణంగా రైల్వే అధికారులు 19 రైళ్లను రద్దు చేసి, 26 రైళ్లను దారి మళ్లించారు.
హైదరాబాద్: సికింద్రాబాద్ (Secunderabad) రైల్వే స్టేషన్ (Rainway Station)కు ఒడిశా (Odisha) కోరమండల్ రైల్ ప్రమాదం ఎఫెక్ట్ (Coromandel Rail Accident Effect) తగిలింది. బాలాసోర్ జిల్లా (Balasore District)లో జరిగిన రైలు ప్రమాదం కారణంగా రైల్వే అధికారులు 19 రైళ్లను రద్దు చేసి, 26 రైళ్లను దారి మళ్లించారు. ఒడిశా, బెంగాల్ వైపు వెళ్ళే రైళ్ల రద్దుతో సికింద్రాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ట్రాక్ పునరుద్ధరణ జరుగుతున్న నేపథ్యంలో మరో రెండు రోజులపాటు రైళ్ల రద్దు ఉంటుందని తెలియవచ్చింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో నిన్నటి నుంచి ప్రయాణికులు పడి గాపులుగాస్తున్నారు. రైళ్ల రద్దుతో సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రయాణీకులకు డబ్బు రిఫండ్ చేస్తున్నారు.