TS News: డెక్కన్ మాల్ కూల్చివేతపై ముంబై, ఢిల్లీ కంపెనీలతో చర్చిస్తున్న అధికారులు

ABN , First Publish Date - 2023-01-23T13:07:10+05:30 IST

సికింద్రాబాద్ రాంగోపాల్ పేట్ పీఎస్ పరిధిలోని నల్లగుట్ట వద్ద డెక్కన్ మాల్ కార్పొరేట్ భవనంలో అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది.

TS News: డెక్కన్ మాల్ కూల్చివేతపై ముంబై, ఢిల్లీ కంపెనీలతో చర్చిస్తున్న అధికారులు

హైదరాబాద్: సికింద్రాబాద్ రాంగోపాల్ పేట్ పీఎస్ పరిధిలోని నల్లగుట్ట వద్ద డెక్కన్ మాల్ కార్పొరేట్ భవనంలో అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్త చర్యగా భవనం వద్ద అధికారులు రెండు ఫైర్ ఇంజన్‌లు ఉంచారు. బిల్డింగ్ కూల్చి వేతపై ముంబై, ఢిల్లీ కంపెనీలతో ఉన్నతాధికారులు సంప్రదింపులు చేస్తున్నారు. అయితే భవనం బిల్డింగ్ పిల్లర్లకు వచ్చిన ప్రమాదం ఏమి లేదని నిట్ నిపుణుల బృందం తన నివేదికలో పేర్కొన్నారు. పిల్లర్ల నాణ్యత చూసి బిల్డింగ్ కుల్చివేతపై నిర్లక్ష్యం చేయొద్దని నిట్ నిపుణుల బృందం ఆ నివేదికలో పేర్కొన్నారు. అయితే బిల్డింగ్ స్లాబ్లు అలానే వదిలేస్తే చుట్టూ ప్రక్కల ఇళ్లు ధ్వంసం అయ్యే ప్రమాదం ఉందని జీహెచ్ఎంసీ అధికారులకు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు.

సికింద్రాబాద్ రాంగోపాల్ పేట్ పీఎస్ పరిధిలోని నల్లగుట్ట వద్ద డెక్కన్ నైట్ వేర్ స్పోర్ట్స్ మాల్ కూల్చివేతకు అధికారులు రోబోటిక్ టెక్నాలజీని ఉపయోగించాలనుకుంటున్నారు. పక్క భవనాలకు డ్యామేజ్ జరగకుండా డెక్కన్ మాల్ కూల్చివేతకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. మాల్ లోపల 10 వేల టన్నుల వ్యర్థాలు పేరుకుపోయాయి. కొంత వరకు క్రేన్ల సాయంతో ముందు భాగం నుంచి వ్యర్థాలను తొలగించారు.

భవనం కూల్చివేత ఖర్చులను జీహెచ్ఎంసీ అధికారులు యాజమానుల నుంచి వసూలు చేయనున్నారు. కటింగ్ మెషీన్ల ద్వారా స్లాబ్ భాగాలను కూల్చి వేయనున్నారు. ఫైర్ యాక్సిడెంట్ నేపథ్యంలో భవన యజమానికి జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. మంటల ధాటికి భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో కూల్చి వేస్తామని అధికారులు తెలిపారు. ఈ మేరకు నోటీసులు పంపించారు.

Updated Date - 2023-01-23T13:07:15+05:30 IST