Hyderabad: జంట జలాశయాలకు భారీగా వరద నీరు..

ABN , First Publish Date - 2023-07-23T12:33:10+05:30 IST

హైదరాబాద్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జంట జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఉస్మాన్ సాగర్‌కు 100 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. దీంతో ఉస్మాన్ సాగర్ ప్రస్తుత  నీటి మట్టం 1785.85 అడుగులు కాగా..

Hyderabad: జంట జలాశయాలకు భారీగా వరద నీరు..

హైదరాబాద్: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు జంట జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ఉస్మాన్ సాగర్‌కు 100 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. దీంతో ఉస్మాన్ సాగర్ ప్రస్తుత  నీటి మట్టం 1785.85 అడుగులు కాగా.. పూర్తిస్థాయి  నీటి  మట్టం 1790 అడుగులు.

అటు హిమాయత్ సాగర్‌కు 1500  క్యూసెక్కుల వరద వస్తోంది.  హిమాయత్  సాగర్  ప్రస్తుత  నీటిమట్టం 1762.50 అడుగులు కాగా పూర్తిస్థాయి నీటి మట్టం  1763.50 అడుగులు. దీంతో హిమాయత్ సాగర్ 4 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి 2,750 క్యూసెక్కుల నీటిని మూసిలోకి విడుదల చేస్తున్నారు. దాంతో హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్డుపై నుంచి వరద నీరు ప్రవహిస్తోంది. హిమాయత్ నగర్ నుంచి రాజేంద్రనగర్ వైపు వెళ్లే ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డును మూసివేశారు. పోలీసులు ఇరువైపుల బారికేడ్స్ ఏర్పాటు చేశారు. హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో లోతట్టు ప్రాంతాలు అప్రమత్తమయ్యాయి.

మరోవైపు భద్రాచలం వద్ద స్వల్పంగా గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. 43.50 అడుగుల వద్ద 9,55,828 క్యూ సెక్కుల ప్రవాహంతో మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

నిజామాబాద్ జిల్లా.. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరదనీరు చేరుతోంది. 78,887 క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 1091 అడుగులు, 90 టీఎంసీలు.. ప్రస్తుతం నీటిమట్టం 1082 అడుగులు, 60.341 టీఎంసీలు ఉంది.

Updated Date - 2023-07-23T12:33:10+05:30 IST