Hyderabad-Vijayawada Highway: టోల్ ప్లాజా వద్ద బారులు తీరిన వాహనాలు
ABN , First Publish Date - 2023-01-13T11:27:59+05:30 IST
హైదరాబాద్-విజయవాడ హైవేపై(Hyderabad-Vijayawada Highway) భారీగా వాహనాలతో
హైదరాబాద్/యాదాద్రి/చౌటుప్పల్: హైదరాబాద్-విజయవాడ హైవేపై(Hyderabad-Vijayawada Highway) భారీగా వాహనాలతో రద్దీగా మారింది. నేటి నుంచి సెలవులు కావడంతో హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు పయనమయ్యారు. ఒకే సమయంలో వేల సంఖ్యలో వాహనాలు రావడంతో పంతంగి టోల్‌ప్లాజా(Pantangi Toll Plaza) దగ్గర వాహనాలు బారులు తీరాయి. సాధారణ రోజుల్లో ఈ రెండు రూట్లలో కలిపి 24 గంటల్లో 10 వేల కార్లు వస్తుంటాయి. పండుగ కావడంతో వాహనాలు పెరిగాయి. దీంతో రద్దీ భారీగా పెరిగింది. ఇక శుక్రవారం, శనివారం, ఇంకా వాహనాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే.. కొన్ని వాహనాలు ఫాస్టాగ్ లు(Fastag) సరిగ్గా స్కాన్ కాకపోవడంతో వాహనాలు టోల్ వద్ద నిలిచిపోతున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. ఇప్పటికే బస్‌స్టేషన్లు, రైల్వేస్టేషన్లు(Bus stations, railway stations) కిక్కిరిసిపోయాయి.