TS High Court: సమాచార కమిషనర్ల నియామకంపై ప్రభుత్వం వివరణ.. విచారణ వాయిదా

ABN , First Publish Date - 2023-08-23T17:16:07+05:30 IST

సమాచార కమిషనర్ల నియామకంలో జాప్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పిల్‌పై సీజే జస్టిస్ అలోక్ అరాధే ధర్మాసనం విచారణ చేపట్టింది.

TS High Court: సమాచార కమిషనర్ల నియామకంపై ప్రభుత్వం వివరణ.. విచారణ వాయిదా

హైదరాబాద్: సమాచార కమిషనర్ల నియామకంలో జాప్యంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పిల్‌పై సీజే జస్టిస్ అలోక్ అరాధే ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రధాన, రాష్ట్ర సమాచార కమిషనర్ల నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చామని ప్రభుత్వం తెలిపింది. ప్రధాన సమాచార కమిషనర్ కోసం 40 దరఖాస్తులు.. రాష్ట్ర సమాచార కమిషనర్ పోస్టుల కోసం 273 దరఖాస్తులు వచ్చాయని ప్రభుత్వం వెల్లడించింది. సమాచార కమిషనర్ల నియామకం కోసం ఎంపిక కమిటీ ఏర్పాటు చేస్తామని.. సమాచార కమిషనర్ల ఎంపిక కోసం నాలుగు వారాల గడువు ఇవ్వాలంటూ న్యాయస్థానాన్ని సర్కార్ కోరింది. దీంతో సమాచార కమిషనర్ల నియామకంపై విచారణ నాలుగు వారాలకు ధర్మాసనం వాయిదా వేసింది.

Updated Date - 2023-08-23T17:16:07+05:30 IST