Kadiyam Srihari: ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టారు
ABN , Publish Date - Dec 21 , 2023 | 11:55 AM
కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్‌కు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్‌లో నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారన్నారు. నెలకు 4 వేల భృతి హామీ ఇచ్చారన్నారు. ఇప్పుడు నిరుద్యోగ భృతి పై మాట మార్చి.. ఇవ్వడం లేదని అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ప్రకటించారని కడియం తెలిపారు.

హైదరాబాద్: కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి పేర్కొన్నారు. ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్‌కు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. కాంగ్రెస్ యూత్ డిక్లరేషన్‌లో నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారన్నారు. నెలకు 4 వేల భృతి హామీ ఇచ్చారన్నారు. ఇప్పుడు నిరుద్యోగ భృతి పై మాట మార్చి.. ఇవ్వడం లేదని అసెంబ్లీలో ఆర్థిక మంత్రి ప్రకటించారని కడియం తెలిపారు. రైతులు రెండు లక్షల రుణం తీసుకోవాలని రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చెప్పారని.. ధాన్యానికి మద్దతు ధరతో పాటు రు.500 బోనస్ ఇస్తామన్నారని కడియం పేర్కొన్నారు. ఈ మూడు హామీలపై కాంగ్రెస్ మాట తప్పిందన్నారు.