Kishan Reddy : కాంగ్రెస్.. బీఆర్ఎస్ రెండూ ఒక్కటే
ABN , First Publish Date - 2023-06-22T14:01:08+05:30 IST
కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇంటింటికీ బీజేపీ కార్యాలయంలో పాల్గొన్న కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే బీఆర్ఎస్లో చేరుతారన్నారు.
హైదరాబాద్ : కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇంటింటికీ బీజేపీ కార్యాలయంలో పాల్గొన్న కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే బీఆర్ఎస్లో చేరుతారన్నారు. బీజేపీతోనే తెలంగాణలో ప్రజాస్వామ్య ప్రభుత్వం సాధ్యమవుతుందన్నారు. మోదీ నాయకత్వంలో దేశంలో స్థిరమైన ప్రభుత్వం ఉంటుందన్నారు. అవినీతి పార్టీలు ఏకమైతే దేశం కుక్కలు చింపిన విస్తరవుతుందన్నారు. బలిదానాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ.. ఈ రోజు ఓ కుటుంబం పాలైందన్నారు. సీఎం కేసీఆర్ కుటుంబం వేల కోట్ల ప్రజల డబ్బును దోచుకొని మళ్లీ ఏలాలనుకుంటోందన్నారు. భూములు, బిల్డింగ్లు కొనాలనుకుంటున్నారన్నారు. తెలంగాణ అవినీతిమయం అయిందని.. కల్వకుంట్ల కుటుంబంపాలైందన్నారు. బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీనే నిలబడుతుందన్నారు. బీఆర్‌ఎస్‌తో బీజేపీ ఇప్పటి వరకూ పొత్తు పెట్టుకోలేదని కిషన్ రెడ్డి అన్నారు.