YSS Sangam: స్వామి చిదానందగిరిచే క్రియాయోగ దీక్షా ప్రదానం

ABN , First Publish Date - 2023-02-15T20:57:07+05:30 IST

క్రియయోగమన్నది మనిషి రక్తంలో ఉన్న కర్బనాన్ని హరింపజేసి ఆక్సిజన్‌తో నింపే ఒకానొక మానసిక శారీరక ప్రక్రియ అని, మెదడులోనూ వెనుబాములోను ఉన్న కేంద్రాల్ని నవశక్తితో నింపడానికి ఈ అదనపు ఆక్సిజన్ అణువులు ప్రాణశక్తి ప్రవాహంగా మారిపోతాయని....

YSS Sangam: స్వామి చిదానందగిరిచే క్రియాయోగ దీక్షా ప్రదానం

హైదరాబాద్: కన్హా శాంతివనం (Kanha Santhi Vanam)లో యోగదా సత్సంగ సొసైటీ / సెల్ఫ్ రియలైసెషన్ ఫెలోషిప్ (Self Realization Fellowship) అంతర్జాతీయ అధ్యక్షులు స్వామి చిదానందగిరి (Swami Chidananda Giri) ఆధ్వర్యంలో క్రియా యోగ దీక్ష కార్యక్రమం కన్నుల పండువగా జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఎస్ (YSS) స్వాములు అర్హులైన వందలాది మందికి క్రియ యోగ దీక్ష (Kriya Yoga) ప్రసాదించారు. క్రియ యోగ ప్రాధాన్యతను వివరించారు. యోగదా సత్సంగ సొసైటీ వ్యవస్థాపకులు పరమహంస యోగానంద (Paramahansa Yogananda) రచించిన ఒక యోగి ఆత్మకథ (Autobiography of a Yogi)లో క్రియ యోగానికి సంబంధించిన చాలా వివరాలను అందించారు.

క్రియయోగమన్నది మనిషి రక్తంలో ఉన్న కర్బనాన్ని హరింపజేసి ఆక్సిజన్‌తో నింపే ఒకానొక మానసిక శారీరక ప్రక్రియ అని, మెదడులోనూ వెనుబాములోను ఉన్న కేంద్రాల్ని నవశక్తితో నింపడానికి ఈ అదనపు ఆక్సిజన్ అణువులు ప్రాణశక్తి ప్రవాహంగా మారిపోతాయని, ఒక యోగి ఆత్మకథలో ఉంది. ఒంట్లో కలుషరక్తం జమ కాకుండా ఆపి, యోగి కణజాలాల క్షయాన్ని తగ్గించడం కాని ఆపెయ్యడము కాని చేస్తాడని, ప్రగతి సాధించిన యోగి, తన శరీరకణాల్ని శక్తిగా మార్చేస్తాడని, ఒక యోగి ఆత్మకథలో ప్రస్తావించారు. క్రియాయోగం సనాతన శాస్త్రమైన క్రియాయోగాన్ని యోగదా సత్సంగ సొసైటీ పరమగురువులు లాహిరి మహాశయులు (Lahiri Mahasaya) తమ గురుదేవులైన మహావతార్ బాబాజీ (Mahavatar Babaji) నుంచి పొందారు. అంధయుగాల్లో మరుగున పడిపోయిన ఈ ప్రక్రియను బాబాజీ పునరుద్ధరించారు. శరీర వ్యాయామం, మనోనిగ్రహం ఓంకారం మీద ధ్యానం కలిసి క్రియాయోగమవుతుందని మహర్షి పతంజలి (Patanjali) గతంలోనే చెప్పారు.

ఉచ్చ్వాస నిశ్వాసల గతిని విచ్చేదించడంద్వారా జరిగే ప్రాణాయామంవల్ల ముక్తి సాధించవచ్చని పతంజలి వేల సంవత్స్తరాల క్రితమే వివరించారు. క్రియాయోగం మానవ పరిణామాన్ని త్వరితం చెయ్యడానికి ఉపకరించె సాధనమని యోగదా సత్సంగ సొసైటీ (Yogoda Satsanga Society) పరమగురువైన శ్రీ యుక్తేశ్వర్ గిరి (Yukteswar Giri) కూడా వివరించారు. కన్హా శాంతివనంలో జరిగిన ఈక్రియాయోగ దీక్ష కార్యిక్రమంలో వేలాదిమంది భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-15T23:05:03+05:30 IST