Secunderabad FIRE accident: సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు మృతి

ABN , First Publish Date - 2023-03-16T23:48:40+05:30 IST

సికింద్రాబాద్‌లో జనసంచారం ఎక్కువగా ఉండే స్వప్నలోక్ కాంప్లెక్స్‌(Swapnalok complex)లో భారీ అగ్నిప్రమాదం(FIRE accident) చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు మృతిచెందారు.

Secunderabad FIRE accident: సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం..  ఆరుగురు మృతి

సికింద్రాబాద్( Secunderabad): సికింద్రాబాద్‌లో జనసంచారం ఎక్కువగా ఉండే స్వప్నలోక్ కాంప్లెక్స్‌(Swapnalok complex)లో భారీ అగ్నిప్రమాదం(FIRE accident) చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు వ్యక్తులు మృతిచెందారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతిచెందిన వారిని ప్రమీల, వెన్నెల, శ్రావణి, త్రివేణి, శివ, ప్రశాంత్‌గా గుర్తించారు. దట్టమైన పొగతో వీరు మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో 4 ,5, 6, ఫ్లోర్లలో దట్టమైన పొగలు, మంటలు చెలరేగడంతో భవనం మొత్తం వ్యాపించాయి. ఈ భవనంలో మొత్తం ఎనిమిది ఫ్లోర్లు ఉన్నాయి.4 ,5, ఫ్లోర్లలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు 25 మంది చిక్కుకుపోయారు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న కరెంటు ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ ఏర్పడడం వల్ల ఈ అగ్నిప్రమాదం సంభవించింది. సాయంత్రం 6:00గంటల సమయంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది.

దట్టమైన పొగతో కొంతమందికి శ్వాసఆడక సోమసిల్లి పడిపోయారని సమాచారం. 10 ఫైరింజన్లతో మంటలను అదుపు చేయడనికి ఫైర్ సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు.ఇది పాత భవనం కావడం వల్ల ప్రాణనష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. మంటల తీవ్రత పెరిగే అవకాశముందని భావించిన అధికారులు సమీప నివాసాల్లో ఉన్న వారిని ఖాళీ చేయిస్తున్నారు. ఘటన స్థలాన్ని మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, డీసీపీ సుమతి పరిశీలించారు. వారు దగ్గరుండి ప్రమాద నివారణ చర్యలు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. మంటలు ఇంకా అదుపులోకి రాకపోవడంతో స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.

Updated Date - 2023-03-17T00:39:23+05:30 IST