రెరా చైర్మన్‌గా ఎన్.సత్యనారాయణ
ABN , First Publish Date - 2023-06-13T03:40:29+05:30 IST
తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(టీఎస్ రెరా)కి ప్రభుత్వం ఎట్టకేలకు చైర్మన్‌ను ఎంపిక చేసింది. సీడీఎంఏ ఎన్.సత్యనారాయణను రెరా చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. పలు జిల్లాల్లో కలెక్టర్‌గా పనిచేసి.
ఇద్దరు సభ్యులు కూడా.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, జూన్ 12 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(టీఎస్ రెరా)కి ప్రభుత్వం ఎట్టకేలకు చైర్మన్‌ను ఎంపిక చేసింది. సీడీఎంఏ ఎన్.సత్యనారాయణను రెరా చైర్మన్‌గా నియమిస్తూ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్‌కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. పలు జిల్లాల్లో కలెక్టర్‌గా పనిచేసి.. సీనియర్ ఐఏఎస్ హోదాలో సత్యనారాయణ ప్రస్తుతం కమిషనర్ అండ్ డైరెక్టర్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్(సీడీఎంఏ)గా కొనసాగుతున్నారు. ఆయన ఈ నెలాఖరులో పదవీ విరమణ పొందనున్నారు. రెరా సభ్యులుగా జీహెచ్‌ఎంసీలో పదవీ విరమణ పొందిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కె.శ్రీనివాస్ రావు, వాణిజ్య పన్నుల శాఖలో పదవీ విరమణ పొందిన లక్ష్మీనారాయణను నియమించారు.