Share News

Epion Pain Center: బెంగళూరులో ఇపియోన్ పెయిన్ సెంటర్ ప్రారంభం

ABN , First Publish Date - 2023-11-17T14:35:37+05:30 IST

బెంగళూరులో ప్రఖ్యాత మోకాళ్ల నొప్పుల నివారణ కేంద్రం “ఇపియోన్ పెయిన్ సెంటర్‌’’ ను డైరెక్టర్ మరియు వ్యవస్థాపకులు అయిన డాక్టర్ సుధీర్ ప్రారంభించారు.

Epion Pain Center: బెంగళూరులో  ఇపియోన్ పెయిన్ సెంటర్ ప్రారంభం

బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరులో ప్రఖ్యాత మోకాళ్ల నొప్పుల నివారణ కేంద్రం “ఇపియోన్ పెయిన్ సెంటర్‌’’ను డైరెక్టర్, వ్యవస్థాపకులు డాక్టర్ సుధీర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బెంగళూరులో అత్యంత అధునాతన యంత్రాలు, సాంకేతిక పరిజ్ఞానం కలిగి, అతి తక్కువ ధరలో నాణ్యత గల వైద్యాన్ని అందించే ఏకైక నొప్పి నివారణ కేంద్రంగా తాము గుర్తింపు పొందినట్లుగా చెప్పారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ప్లాస్మా రీజనరేటివ్ తెరపి అందుబాటులోకి తెచ్చిన తాము, దేశంలోని ఇతర నగరాలలో కూడా తమ సేవలను అందుబాటులోకి తేవాలని ఆశించి అన్ని నగరాల్లో తమ కేంద్రాలను ప్రారంభిస్తున్నట్లుగా వెల్లడించారు. ఇందులో భాగంగా చెన్నైలో ఇది వరకే తమ సెంటర్‌ను ప్రారంభించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇక ఇప్పుడు బెంగళూరులో కూడా తమ ఇపియోన్ సెంటర్ ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు. రానున్న 2 సంవత్సరాల్లో మరో 10 కేంద్రాలను ప్రారంభించనున్నట్లు సుధీర్ వెల్లడించారు.

Updated Date - 2023-11-17T14:53:29+05:30 IST