Telangana 15 Police Awards : తెలంగాణ నుంచి 15 మందికి పోలీసు పతకాలు
ABN , First Publish Date - 2023-01-26T04:21:58+05:30 IST
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంశాఖ...
అడిషనల్ డీజీ అనిల్‌కుమార్, టీఎస్‌ఎస్‌పీ అదనపు కమాండెంట్ రామకృష్ణ ఎంపిక
మరో 13 మందికి మెరిటోరియస్ మెడల్స్
దేశవ్యాప్తంగా 901 మందికి పతకాలు
140 మందికి గ్యాలెంట్రీ మెడల్స్..
రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్రం ప్రకటన
ఏపీ నుంచి 17 మందికి పోలీసు మెడల్స్
న్యూఢిల్లీ, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంశాఖ ప్రకటించిన పోలీసు పతకాలకు తెలంగాణ నుంచి 15 మంది ఎంపికయ్యారు. హైదరాబాద్ అదనపు డీజీపీ అనిల్ కుమార్, టీఎ్‌సఎ్‌సపీ 12వ బెటాలియన్ అదనపు కమాండెంట్ రామకృష్ణ రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకానికి ఎంపిక కాగా, మరో 13 మందికి పోలీసు మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ లభించాయి. కేంద్రీయ సంస్థల్లో పనిచేస్తున్న పలువురు తెలుగు పోలీసులకూ పతకాలు వచ్చాయి. దేశవ్యాప్తంగా మొత్తం 901 మందిని కేంద్ర హోంశాఖ పోలీసు పతకాలకు ఎంపిక చేసింది. బుధవారం జాబితా విడుదల చేసింది. ఇందులో 140 మందికి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలెంట్రీ, 93 మందికి రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకం, 668 మందికి మెరిటోరియస్ సర్వీస్ మెడల్స్ ప్రకటించింది. గ్యాలెంట్రీ పతకాలు దక్కించుకున్న 140 మందిలో 48 మంది సీఆర్పీఎఫ్ పోలీసులు ఉన్నారు.
ఏపీ నుంచి 17 మందికి పోలీసు పతకాలకు ఎంపికయ్యారు. అత్యున్నత పోలీసు పురస్కారమైన రాష్ట్రపతి పోలీస్ మెడల్ ఫర్ గ్యాలెంట్రీ మెడల్‌ను ఈ ఏడాది ఎవరికీ ప్రకటించలేదు. తెలంగాణ క్యాడర్ ఐపీఎస్ అధికారిణి చారుసిన్హాకు రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకం లభించింది. ఆమె శ్రీనగర్ సెక్టార్ ఐజీగా పనిచేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన, పంజాబ్ కేడర్‌లో పనిచేస్తున్న ఐపీఎస్ అధికారి గొల్లపల్లి నాగేశ్వరరావు, యూపీలో అదనపు డీజీ నామాల రవీందర్‌నూ ఈ పతకానికి ఎంపిక చేశారు. జమ్మూ కశ్మీర్ క్యాడర్‌లో పనిచేస్తున్న ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన జీవీ సందీప్ చక్రవర్తికి గ్యాలెంట్రీ మెడల్ లభించింది. బీఎస్‌ఎఫ్ కానిస్టేబుల్ బొల్లం రామాంజనేయులునూ ఈ పతకం వరించింది. సీఆర్‌పీఎ్‌ఫ కానిస్టేబుళ్లుగా పనిచేసిన గుల్లిపల్లి శ్రీను, చత్తి ప్రవీణ్‌కు మరణానంతరం గ్యాలెంట్రీ మెడల్ ప్రకటించారు.
పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్
తరుణ్ జోషి, ఐజీ, కమిషనర్, వరంగల్; పేర్ల విశ్వప్రసాద్, డీఐజీ, జాయింట్ కమిషనర్, ఎస్‌బీ, హైదరాబాద్; గంగసాని శ్రీధర్, ఏసీపీ, సైబర్‌క్రైమ్ పోలీస్ స్టేషన్, హైదరాబాద్; పూనాటి నరసింహా రావు, డీఎస్పీ, ప్రాంతీయ ఇంటలిజెన్స్ కార్యాలయం, హైదరాబాద్; గాండ్ల వెంకటేశ్వర్లు, ఇన్‌స్పెక్టర్, సిటీ స్పెషల్ బ్రాంచ్, కరీంనగర్; మామిల శ్రీధర్ రెడ్డి, ఇన్స్‌పెక్టర్, ఐటీ సెల్, హైదరాబాద్; నారాయణస్వామి జైశంకర్, అసిస్టెంట్ రిజర్వు ఎస్‌ఐ, 3వ బెటాలియ్, రంగారెడ్డి జిల్లా; కారుకొండ దయాశీల, రిజర్వు ఇన్స్‌పెక్టర్, వరంగల్; గంగుల అచ్యుత రెడ్డి, అసిస్టెంట్ అసాల్ట్ కమాండర్ కార్యాలయం, గ్రేహౌండ్స్, హైదరాబాద్; నడింపల్లి రాందేవ్ రెడ్డి, ఇన్‌స్పెక్టర్, ఇంటలిజెన్స్, హైదరాబాద్; ఐజారి వీర రామాంజనేయులు, ఏఆర్‌ఎ్‌సఐ, సీఐ సెల్, ఇంటెలిజెన్స్, హైదరాబాద్; బోండ వెంకట సన్యాసిరావు, ఇన్స్‌పెక్టర్, డీజీ కార్యాలయం, టీఎ్‌సపీఎఫ్, హైదరాబాద్; రామపోగు అరుణ్‌రాజ్ కుమార్, డీఎస్పీ, బేగంపేట, హైదరాబాద్.
రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకం (కేంద్రీయ విభాగాల్లో తెలుగు పోలీసులకు)
1. మెరుగు రవీందర్‌రెడ్డి, ఏఎ్‌సఐ, 2వ సిగ్నల్ బెటాలియన్, సీఆర్పీఎఫ్, హైదరాబాద్
2. ఎన్ మధుసూదన్ రెడ్డి, సంయుక్త డైరెక్టర్, సర్దార్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ, హైదరాబాద్
3. రాజారాం, ఐజీ, సికింద్రాబాద్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (రైల్వే శాఖ)
పోలీస్ మెడల్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్ (కేంద్రియ విభాగాల్లో తెలుగు పోలీసులకు)
రేఖా నంబియార్, సీనియర్ కమాండెంట్, షార్, శ్రీహరికోట; ఎంఎన్ లక్ష్మీనరసింహ స్వామి, ఎస్‌ఐ, షార్, శ్రీహరికోట (సీఐఎ్‌సఎఫ్); సదాశివం, డిప్యూటీ కమాండెంట్, హైదరాబాద్ (సీఆర్పీఎఫ్); యుధిస్థిర బెహెరా, ఏడీ, విజయవాడ (కేంద్ర హోం శాఖ); కేబీ వందన, డీఐజీ, హైదరాబాద్ (ఎన్‌ఐఏ); అజిత్ కుమార్ సింగ్, అసిస్టెంట్ కమాండెంట్, హైదరాబాద్ (సర్దార్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ); దేవరాయి శ్రీనివాసరావు, ఏసీ, ఆర్‌పీఎఫ్, మౌలాలి హైదరాబాద్; ఎన్ శ్రీనివాస్ రావు, ఎస్‌ఐ, ఆర్‌పీఎఫ్; ప్రఫుల్ల భలేరావు, హెడ్ కానిస్టేబుల్, ఆర్‌పీఎఫ్, హైదరాబాద్ (రైల్వే శాఖ).