ఎంపీ వెంకటరెడ్డి నుంచి రక్షణ కల్పించండి

ABN , First Publish Date - 2023-03-11T04:19:36+05:30 IST

ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నుంచి తమ కుటుంబానికి భద్రత కల్పించాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ కుమారుడు సుహాస్‌ మానవ హక్కుల కమిషన్‌ను కోరారు.

ఎంపీ వెంకటరెడ్డి నుంచి రక్షణ కల్పించండి

మానవహక్కుల కమిషన్‌కు చెరుకు సుహాస్‌ ఫిర్యాదు

నల్లగొండ/హైదరాబాద్‌, మార్చి 10(ఆంధ్రజ్యోతి): ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నుంచి తమ కుటుంబానికి భద్రత కల్పించాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్‌ కుమారుడు సుహాస్‌ మానవ హక్కుల కమిషన్‌ను కోరారు. తనను, తన తండ్రిని చంపుతానంటూ కోమటిరెడ్డి బెదిరించారన్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని మానవ హక్కుల కమిషన్‌ కార్యాలయంలో శుక్రవారం ఫిర్యాదు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘ఈ నెల 5న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాకు ఫోన్‌ చేసి నన్ను, మా నాన్నను చంపడం కోసం 100 కార్లలో తన మనుషులు తిరుగుతున్నారని, నల్లగొండలోని మా ఆసుపత్రిని కూల్చివేస్తామని బెదిరించారు’’ అని వెల్లడించారు.

నల్లగొండ వన్‌ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా వెంకటరెడ్డిపై కేసు నమోదు చేశారన్నారు. జిల్లా ఎస్పీ అపూర్వరావును కలిసి జరిగిన దాన్ని వివరించినా కేసు దర్యాప్తులో ఎటువంటి పురోగతి లేదన్నారు. తనకున్న రాజకీయ, ఆర్థిక పలుకుబడిని ఉపయోగించి దర్యాప్తు ముందుకు సాగనివ్వకుండా చేసి నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు వెంకటరెడ్డి ప్రయత్నం చేస్తున్నారని చెరుకు సుహాస్‌ ఆరోపించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని విచారించి దోషులను కఠినంగా శిక్షించాలని, పారదర్శకమైన పక్షపాత రహితమైన విచారణ త్వరగా చేపట్టాలని సుహాస్‌ విజ్ఞప్తి చేశారు.

Updated Date - 2023-03-11T04:19:36+05:30 IST