సోమేశ్‌ కుమార్‌ వీఆర్‌ఎస్‌?

ABN , First Publish Date - 2023-02-16T03:31:15+05:30 IST

తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. బిహార్‌కు చెందిన ఆయన 1989 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి..

సోమేశ్‌ కుమార్‌ వీఆర్‌ఎస్‌?

ఆమోదించిన ఏపీ సీఎం జగన్‌

నేడు, రేపో ఉత్తర్వులు వెలువడే అవకాశం

తెలంగాణ హైకోర్టు ఆదేశాలతో ఏపీకి సోమేశ్‌

అక్కడ రిపోర్టు.. ఆ వెంటనే హైదరాబాద్‌కు..

వీఆర్‌ ఎస్‌కు అర్జీతో పోస్టింగ్‌ ఇవ్వని ఏపీ సర్కార్‌

అమరావతి, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. బిహార్‌కు చెందిన ఆయన 1989 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి.. రాష్ట్ర విభజన సమయంలో ఆయనను ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు కేటాయించినా.. సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ఉత్తర్వుల మేరకు తెలంగాణలోనే కొనసాగారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘ కాలం పని చేశారు. అయితే క్యాట్‌ ఉత్తర్వులను డీవోపీటీ తెలంగాణ హైకోర్టులో సవాల్‌ చేయడంతో హైకోర్టు ఆయనను తక్షణం ఏపీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. మరో అవకాశం లేకపోవడంతో కొద్ది రోజుల క్రితం ఆయన ఏపీ జీఏడీలో రిపోర్టు చేశారు. ఆ వెంటనే ఆయన హైదరాబాద్‌కు వచ్చారు. ఏపీ ప్రభుత్వం కూడా ఆయనకు ఎలాంటి పోస్టింగ్‌ ఇవ్వలేదు. ఒక రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి, మరో రాష్ట్రంలో అంతకంటే తక్కువ పోస్టులో పని చేయడానికి సోమేశ్‌ ఇష్టపడలేదు. ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తారని అప్పట్లో ‘ఆంధ్రజ్యోతి’ కథనం కూడా ప్రచురించింది. దానిని ఆయన ఖండించినప్పటికీ కొద్ది రోజుల కిందటే ఆయన స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారు. ఆయన స్వచ్ఛంద పదవీ విరమణకు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ ఆమోద ముద్ర వేశారు.

రెండ్రోజుల్లో దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా వెలువడే అవకాశముంది. వాస్తవానికి సోమేశ్‌ కుమార్‌కు ఈ ఏడాది డిసెంబర్‌ వరకూ సర్వీ్‌సలో కొనసాగే అవకాశముంది. కానీ తెలంగాణ ప్రభుత్వంలో మరో పోస్టులో కొనసాగడానికి వీలుగా ఆయన ముందుగా వీఆర్‌ఎస్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటు డీవోపీటీ నిబంధనల ప్రకారం 30 ఏళ్లు సర్వీస్‌ పూర్తి చేసిన వారు స్వచ్ఛంద పదవీ విరమణ చేస్తే.. దానిని కేంద్రం ఆమోదించాల్సిన అవసరం లేదు. సదరు అధికారులు ఏ రాష్ట్రానికి కేటాయించిన వారు అయితే ఆ రాష్ట్ర ప్రభుత్వమే వీఆర్‌ఎ్‌సను ఆమోదించవచ్చు. సోమేశ్‌ కుమార్‌ కూడా ఈ నిబంధనలను ఉపయోగించుకుని వీఆర్‌ఎ్‌సను ఆమోదింప చేసుకున్నట్లు ఐఏఎస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Updated Date - 2023-02-16T03:31:21+05:30 IST