Hyderabad News: ఎస్‌ఆర్ నగర్ జోన్ పరిధిలోని నారాయణ పాఠశాలల విద్యార్థులకు క్రీడాపోటీలు
ABN , First Publish Date - 2023-11-19T07:52:16+05:30 IST
స్థానిక ఎస్‌ఆర్ నగర్ జోన్ పరిధిలోని నారాయణ పాఠశాలల విద్యార్థులకు శనివారం క్రీడా పోటీలు నిర్వహించారు.
హైదరాబాద్: స్థానిక ఎస్‌ఆర్ నగర్ జోన్ పరిధిలోని నారాయణ పాఠశాలల విద్యార్థులకు శనివారం క్రీడా పోటీలు నిర్వహించారు. జోన్ పరిధిలో ఉన్న ఎస్‌ఆర్ నగర్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ, మణికొండ, విజయనగర్ కాలనీ, మెహిదీపట్నం, అత్తాపూర్ బ్రాంచ్‌ల విద్యార్థులను కోకో, కబడ్డీ, త్రో బాల్, పరుగు పందాలు ఆడించారు. విద్యార్థులు ఐఐటీ, ఎన్‌ఐటీల్లోనే కాకుండా క్రీడల్లోనూ పోరాట పటిమ కనబరిచారని నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. కాగా ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా నారాయణ పాఠశాలల డీజీఎం గోపాల రెడ్డి, ఎస్‌ఆర్ నగర్ జోన్ ఏజీఎం శ్రీనివాస రెడ్డి, ఎస్‌ఆర్ నగర్ సబ్ ఇన్స్‌స్పెక్టర్ శ్రావణ్, కో ఆర్డినేటర్ లక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు.