Talasani : బోనాలు పండుగ అంటే తిని తాగుడు పండుగ

ABN , First Publish Date - 2023-06-22T13:18:27+05:30 IST

బోనాల పండుగ మొదలైంది. మొదటి బోనం గోల్కొండ కోట పైన జగదాంబ మహంకాళి అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే నేడు ప్రభుత్వం తరపు నుంచి పట్టు వస్త్రాలను.. బంగారు బోనాన్ని మంత్రలు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, మొహమ్మద్ అలీ సమర్పించారు.

Talasani : బోనాలు పండుగ అంటే తిని తాగుడు పండుగ

హైదరాబాద్ : బోనాల పండుగ మొదలైంది. మొదటి బోనం గోల్కొండ కోట పైన జగదాంబ మహంకాళి అమ్మవారికి సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలోనే నేడు ప్రభుత్వం తరపు నుంచి పట్టు వస్త్రాలను.. బంగారు బోనాన్ని మంత్రలు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఇంద్రకరణ్ రెడ్డి, మొహమ్మద్ అలీ సమర్పించారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. మహంకాళి జగదంబికా జాతర బోనాల ఉత్సవాలు ఘనంగా ఈ రోజు ప్రారంభం అవుతున్నాయన్నారు. అంగరంగ వైభవంగా తెలంగాణ నడి బొడ్డున జగదంబికా అమ్మవారి బోనాలు నిర్వహిస్తున్నామన్నారు. బోనాలు పండుగ అంటే తిని తాగుడు పండుగ అని తలసాని అన్నారు.

సికింద్రాబాద్.. లాల్ దర్వాజ్ హైదరాబాద్ వ్యాప్తంగా బోనాల ఉత్సవాలు జరుగుతాయన్నారు. తెలంగాణ ఆధ్వర్యంలో నిన్న ఢిల్లీలో బోనాలు జరిగాయని తలసాని వెల్లడించారు. తెలంగాణ వచ్చాక రాష్ట్ర పండుగగా బోనాలు జరుపుకుంటామన్నారు. బోనాలు.. తొట్టెలు.. గటాల ఊరేగింపు.. రేపు ఫలహారం బండి., గట్టం.. వంటివి నిర్వహించనున్నారు. భారత దేశంలో హిందువుల గురించి మాట్లాడుతారు కానీ హిందువుల పండుగలకు సహకరించేది కేసీఆరేనన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్‌కి అందరూ సహకరించాలన్నారు. అన్ని డిపార్ట్మెంట్ సమాన్మయంతో బోనాల జాతర నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్టం ఏర్పడక ముందు అతి తక్కువ మంది తో గోల్కొండ జగదంబికా అమ్మవారి జాతర జరిగేదన్నారు. కానీ ఇప్పుడు లక్ష మందికి పైగా పాల్గొంటున్నారని తలసాని అన్నారు.

Updated Date - 2023-06-22T13:18:27+05:30 IST