Telangana High Court : 75 ఏళ్ల ఆదివాసీల సుదీర్ఘ పోరాటం తర్వాత టీ హైకోర్టు సంచలన తీర్పు..

ABN , First Publish Date - 2023-07-05T11:11:09+05:30 IST

75 ఏళ్ల పాటు ఆదివాసీలు నిర్వహించిన పోరాటానికి నేడు ఫలితం దక్కింది. పట్టువదలని విక్రమార్కుల్లా ఆదివాసీలు సుదీర్ఘ పోరాటం నిర్వహించి చివరకు సక్సెస్ అయ్యారు. ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 గ్రామాలు రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ పరిధిలోకి వస్తాయని తెలంగాణ హైకోర్టు నేడు తీర్పును వెలువరించింది.

Telangana High Court : 75 ఏళ్ల ఆదివాసీల సుదీర్ఘ పోరాటం తర్వాత టీ హైకోర్టు సంచలన తీర్పు..

హైదరాబాద్ : 75 ఏళ్ల పాటు ఆదివాసీలు నిర్వహించిన పోరాటానికి నేడు ఫలితం దక్కింది. పట్టువదలని విక్రమార్కుల్లా ఆదివాసీలు సుదీర్ఘ పోరాటం నిర్వహించి చివరకు సక్సెస్ అయ్యారు. ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 గ్రామాలు రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ పరిధిలోకి వస్తాయని తెలంగాణ హైకోర్టు నేడు తీర్పును వెలువరించింది. చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేడు తీర్పును వెలువరించారు. ఆదివాసీలు 75 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత వారికి అనుకూలంగా తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఆదివాసుల తరపున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. రాజ్యాంగ పరిధిలోని ఐదవ షెడ్యూల్ పరిధిలోకి సదరు 23 గ్రామాలు రావని ఆదివాసీయేతర రాజకీయ నేతలు కోర్టును ఆశ్రయించారు. ఎట్టకేలకు అదివాసీలకు అనుకూలంగా తీర్పు వచ్చింది.

Updated Date - 2023-07-05T11:11:09+05:30 IST