TS News: కిషన్‌రెడ్డి లేఖ సారాంశం ఏమిటంటే..?
ABN , First Publish Date - 2023-04-09T16:16:05+05:30 IST
కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) లేఖ రాశారు.
హైదరాబాద్: కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ మంత్రికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) లేఖ రాశారు. తెలంగాణ (Telangana) నుండి 15 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యాన్ని సేకరించాలని కోరారు. రైతు సంక్షేమంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) ప్రభుత్వంలోని కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని కిషన్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతులకు కేంద్రప్రభుత్వం.. నిరంతరం మద్దతుగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఇకపైనా.. ఈ సహాయాన్ని కొనసాగిస్తూ.. ఈ ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో తెలంగాణ నుండి 15 లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యం (పార్ బాయిల్డ్ రైస్) సేకరించమని కోరుతూ కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖమంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాశారు. 2015-16 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌లో 5.35 లక్షల మంది రైతులు కేంద్ర ప్రభుత్వ ధాన్య సేకరణ ద్వారా లబ్ధి పొందగా.. గత సీజన్లో 20 లక్షలమంది తెలంగాణ రైతులు లబ్ధిపొందారని లేఖలో గుర్తుచేశారు. తెలంగాణ రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని, ఈ ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లో రాష్ట్రం నుంచి 15 లక్షల మెట్రిక్ టన్నుల పార్ బాయిల్డ్ రైస్ సేకరణకు ఉపక్రమించాలని పీయూష్ గోయల్‌ను కిషన్‌రెడ్డి కోరారు.