TS News: అక్కడకు వెళ్తే పోలీసులకు అభ్యంతరమేంటి?: రేవంత్
ABN , First Publish Date - 2023-05-01T17:48:03+05:30 IST
ORR లీజులో వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు.
హైదరాబాద్: ORR లీజులో వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఆరోపించారు. HMDA కమిషనర్‌కు ఫిర్యాదు చేయాలని వెళ్తే అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఎంపీ (MP)గా సెక్రటేరియట్‌కు వెళ్తే పోలీసులకు అభ్యంతరమేంటి? అని ఆయన ప్రశ్నించారు. పోలీసులు అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు. ORRలో అవినీతి బయటపడుతుందనే ప్రభుత్వం అడ్డుకుంటోందని అన్నారు. ORRను కేసీఆర్ (KCR), కేటీఆర్ (KTR) తెగనమ్ముకున్నారని వ్యాఖ్యానించారు.
కాగా టెలిఫోన్ భవన్ దగ్గర ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సెక్రటేరియేట్‌కు వెళ్లేందుకు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి (Revanth Reddy) యత్నించారు. అనుమతి లేదంటూ రేవంత్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో రేవంత్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు. దాంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. సెక్రటేరియేట్ వెళ్తున్న తనను ఎందుకు అడ్డుకుంటున్నారని రేవంత్ (Revanth Reddy) ప్రశ్నించారు. తాను రోడ్డుపై బైఠాయిస్తానని హెచ్చరించారు. కాగా ORR లీజ్‌లో వెయ్యి కోట్ల అవినీతి జరిగిందని రేవంత్ ఆరోపించారు. HMDA కమిషనర్‌కు ఫిర్యాదు చేయాలని రేవంత్ నిర్ణయం తీసుకున్నారు. రేవంత్‌కు అపాయింట్‌మెంట్ లేదంటూ... పోలీసులు అడ్డుకున్నారు. ఈ సంఘటనతో సచివాలయం దగ్గర భారీగా పోలీసుల మోహరించారు.