TSPSC కీలక నిర్ణయం.. పలు పరీక్ష తేదీలు రీ షెడ్యూల్
ABN , First Publish Date - 2023-04-15T20:32:52+05:30 IST
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక ప్రకటన విడుదల చేసింది.
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక ప్రకటన విడుదల చేసింది. పలు పరీక్ష తేదీలను రీ షెడ్యూల్ చేస్తూ TSPSC నిర్ణయం తీసుకుంది. పలు ఉద్యోగ నియామక పరీక్షలకు కొత్త తేదీలను ప్రకటించింది. ఈ నెల 23 న జరిగే అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ పరీక్షను జూన్ 28కు మార్చారు. అలాగే ఈ నెల 25 వ తేదీన జరిగే అగ్రికల్చర్ ఆఫీసర్ పరీక్ష మే 16న నిర్వహించనున్నారు. ఈ నెల 26..27 జరగాల్సిన తేదీల్లో భూగర్భ జలశాఖలో గెజిటెడ్ పోస్టుల నియామక పరీక్ష.. జూలై 18, 19న నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అలాగే మే 7 జరుగాల్సిన డ్రగ్స్ ఇన్స్పెక్టర్ నియామక పరీక్ష మే19న నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. మే 15..16 వ తేదీన జరుగాల్సిన భూగర్భ జలశాఖలో నాన్ గెజిటెడ్ పోస్టుల నియామక పరీక్షజూలై 20, 21 తేదీల్లో నిర్వహించనున్నట్టు TSPSC ప్రకటించింది.