Tenth paper leak టెన్త్ పేపర్ లీకేజ్‌.. నలుగురు విద్యాశాఖ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు

ABN , First Publish Date - 2023-04-03T18:42:44+05:30 IST

పేపీర్‌ లీకేజ్‌ విషయంలో బాధ్యులైన నలుగురిపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రశ్నాపత్రం బయటకు రావడానికి కారణమైన ఇద్దరు..

Tenth paper leak టెన్త్ పేపర్ లీకేజ్‌.. నలుగురు విద్యాశాఖ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు

హైదరాబాద్: పేపీర్‌ లీకేజ్‌ విషయంలో బాధ్యులైన నలుగురిపై సస్పెన్షన్ వేటు పడింది. ప్రశ్నాపత్రం బయటకు రావడానికి కారణమైన ఇద్దరు ఉపాధ్యాయులు బందెప్ప, సమ్మప్పలతో పాటు విద్యాశాఖకు చెందిన గోపాల్, శివ కుమార్‌లను సస్పెన్షన్ చేస్తూ వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి ప్రకటించారు. గది ఇన్విజిలేటర్ శ్రీనివాస్ ను ఇన్విజిలేషన్ విధుల్లో నుంచి తొలగింపు, బందేప్ప, సమ్మప్పలపై క్రిమినల్ కేసులు నమోదు, ఇన్విజిలేటర్ శ్రీనివాస్ పాత్ర పై సమగ్ర విచారణకు ఆదేశించిన కలెక్టర్ ఆదేశించారు.

తెలంగాణ (Telangana) రాష్ట్రాన్ని ప్రశ్నాపత్రాల లీకేజ్ బెడద వీడటం లేదు. టీఎస్‌పీఎ‌స్పీ పేపర్ లీకేజీ (TSPSC Leakage) ఇష్యూ ముగియక ముందే తాజాగా టెన్త్ ప్రశ్నాపత్రం లీకేజ్ (Tenth Question Paper Leakage) కలకలం రేపుతోంది. సోమవారం ఉదయం వికారాబాద్‌లో జిల్లాలో 10వ తరగతి ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు గుర్తించారు. పరీక్ష మొదలైన నిమిషాల వ్యవధిలోనే ప్రశ్నాపత్రం వాట్సాప్‌లో ప్రత్యక్షమవడం అందరిని ఆందోళనకు గురిచేసింది. ఉదయం 9.37 నిమిషాలకు పేపర్‌‌ను ఫొటో తీసి వాట్సాప్ ద్వారా లీక్ చేసినట్లు తెలుస్తోంది.

సోమవారం ఉదయం 9.30కు పరీక్ష ప్రారంభం కాగా.. కేవలం ఏడు నిమిషాల వ్యవధిలో పేపర్ లీక్ కావడంతో అంతా అవాక్కయ్యారు. లీక్‌పై ఆరా తీస్తే ఓ టీచర్ దీన్ని లీక్ చేసినట్టు తేల్చారు.వికారాబాద్ జిల్లా ప్రభుత్వ ఉపాధ్యాయుడు బంద్యప్ప ఈ పేపర్ లీక్ చేసినట్టు అధికారులు గుర్తించారు. ప్రశ్నాపత్రం లీకేజ్‌తో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు 10వ తరగతి ప్రశ్నాపత్రం లీకేజీపై విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. NSUI, యూత్ కాంగ్రెస్ నాయకులు SSC బోర్డు కార్యాలయాన్ని ముట్టడించారు.ఒక్కసారిగా విద్యార్థి సంఘాల నేతలు SSC బోర్డు కార్యాలయం వద్ద చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కార్యాలయం బోర్డు, గేట్లను ఆందోళనకారులు ధ్వంసం చేశారు. 10వ తరగతి పరీక్ష ప్రశ్నపత్రాల లీకేజ్ పై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

వరుస లీకేజీలో అటు ఉద్యోగార్ధులు, ఇటు విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారని సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేసి ఆందోళన వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ నేతలను అరెస్ట్ చేసి అబిడ్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Updated Date - 2023-04-03T18:47:42+05:30 IST