పాఠశాల, జూనియర్‌ కళాశాలను ఆధునికీకరించాలి

ABN , First Publish Date - 2023-01-12T00:31:34+05:30 IST

కాచిగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్‌ కళాశాలను పూర్తిగా ఆధునికీకరించాలని మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ను అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌ కోరారు.

పాఠశాల, జూనియర్‌ కళాశాలను ఆధునికీకరించాలి
మంత్రి తలసానికి వినతిపత్రం అందజేస్తున్న ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌

  • మంత్రి తలసానిని కోరినఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌

బర్కత్‌పుర, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): కాచిగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, జూనియర్‌ కళాశాలను పూర్తిగా ఆధునికీకరించాలని మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ను అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌ కోరారు. బుధవారం కాచిగూడ ప్రభుత్వ పాఠశాలలో మన బస్తీ - మన బడిపై సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌ పాల్గొని మంత్రికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాచిగూడ ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత, జూనియర్‌ కళాశాలలో 2వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని, ఆధునికీకరిస్తే మరో 2 వేల మంది విద్యార్థులు చదువుకోవడానికి అవకాశం ఉందన్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కొత్త భవనాలు నిర్మించాలని ఆయన కోరారు. అంబర్‌పేట నియోజకవర్గంలో నాలుగు ప్రాథమిక పాఠశాలలు, మూడు ఉన్నత పాఠశాలలను మన బడి - మన బస్తీ కింద ఎంపిక చేశారని, కాచిగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు 88 లక్షలు కేటాయించినట్లు ఆయన తెలిపారు. ఈ నిధులను మరింత పెంచాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ దిడ్డి రాంబాబు, బీఆర్‌ ఎస్‌ నాయకులు బద్దుల ఓంప్రకా ష్‌యాదవ్‌, డాక్టర్‌ శిరీష, ఎర్ర బీష్మాదేవ్‌, కె.సదానంద్‌, థాత్రిక్‌ నాగేందర్‌ బాబ్జీ, బి.కృష్ణగౌడ్‌, మన్నె శ్రీనివా్‌సయాదవ్‌, దేవిరెడ్డి విజితారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-12T00:31:37+05:30 IST