TSPSC పేపర్ లీకేజ్ కేసు.. పోలీస్ కస్టడీకి నిందితులు..

ABN , First Publish Date - 2023-03-18T15:52:11+05:30 IST

హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిందితులను పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో చంచల్ గూడా జైల్లో ఉన్న తొమ్మిది మంది నిందితులను కస్టడీకి తీసుకున్నారు.

TSPSC పేపర్ లీకేజ్ కేసు.. పోలీస్ కస్టడీకి నిందితులు..

హైదరాబాద్: టీఎస్‌పీఎస్సీ (TSPSC) పేపర్ లీకేజీ కేసు (Paper Leakage Case)లో నిందితులను పోలీస్ కస్టడీ (Police Custody)కి నాంపల్లి కోర్టు (Nampally Court) అనుమతి ఇచ్చింది. దీంతో చంచల్ గూడా జైల్లో ఉన్న తొమ్మిది మంది నిందితులను కస్టడీకి తీసుకున్నారు. ఈ కేసులో నిందితులకు ఆరు రోజుల పోలీస్ కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. నిందితులను పది రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేయగా ఆరు రోజుల కస్టడీకి మాత్రమే నాంపల్లి కోర్టు అనుమతిచ్చింది.

నిందితులు...

ఏ-1 ప్రవీణ్ కుమార్

ఏ-2 అట్ల రాజశేఖర్

ఏ-3 రేణుక రాథోడ్

ఏ-4 డాక్య

ఏ-5 కేతావత్ రాజేశ్వర్

ఏ-6 కేతావత్ నీలేష్ నాయక్

ఏ-7 పత్లావత్ గోపాల్ నాయక్

ఏ-8 కేతావత్ శ్రీనివాస్

ఏ-9 కేతావత్ రాజేంద్ర నాయక్.

ఇప్పటికే నిందితులపై సెక్షన్ 420, 409, 120బి, ఐటి యాక్ట్ 66 బి, సి 70 ఆఫ్ ఐటి యాక్ట్ సెక్షన్ 4 అఫ్ తెలంగాణ పబ్లిక్ ఎగ్జామ్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. సిట్ అధికారులు పేపర్ లీకేజ్ వ్యవహారంలో నిందితుల ఆర్థిక లావాదేవీలఫై కూపి లాగనున్నారు. ప్రశ్న పత్రం ఎవరెవరికి విక్రయించారనే దానిపై కూడా ఆరా తీయనున్నారు. నిందితులను ఈనెల 23 వరకు విచారణ చేయనున్నారు.

ఏ-1 ప్రవీణ్ కుమార్, ఏ-2 అట్ల రాజశేఖర్ ఇద్దరు నిందితులను సిట్ అధికారులు టీఎస్‌పీఎస్సీకి తరలించారు. మిగిలిన ఏడుగురు నిందితులను హిమాయత్‌నగర్ సిట్ కార్యాలయానికి తరలించారు.

Updated Date - 2023-03-18T15:52:11+05:30 IST