రుణమాఫీ చేయండి.. లేదా మహారాష్ట్రలో కలపండి
ABN , First Publish Date - 2023-02-17T03:29:42+05:30 IST
బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన రూ.లక్ష రుణమాఫీ హామీని వెంటనే అమలు చేయాలని, లేదంటే తమను మహారాష్ట్రలో కలపాలని గురువారం ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో రైతులు
ఆదిలాబాద్ జిల్లా రైతుల వినూత్న నిరసన
తలమడుగు, ఫిబ్రవరి 16: బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన రూ.లక్ష రుణమాఫీ హామీని వెంటనే అమలు చేయాలని, లేదంటే తమను మహారాష్ట్రలో కలపాలని గురువారం ఆదిలాబాద్ జిల్లా తలమడుగులో రైతులు వినూత్న నిరసనకు దిగారు. కౌలు రైతులకు ఆర్థిక సహాయం, పంట నష్ట పరిహారం, ఎస్టీ, బీసీ రైతులందరికీ సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు అందించాలని, అర్హులైన రైతు కుటుంబానికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం స్పందించి హామీలను అమలు పరచకపోతే.. తమను వెంటనే పక్కనే గల మహారాష్ట్రలో కలపాలని రైతులు డిమాండ్ చేశారు.