Telangana Elections: బీఆర్ఎస్‌ను ఊహించని దెబ్బ కొట్టింది ఈ ఒక్క విషయమేనా..?
ABN , First Publish Date - 2023-12-03T17:31:54+05:30 IST
రాష్ట్రం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడారు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డానికి మూల కారకుడు.. ఆయన తెలంగాణ జాతి పిత.. ఆయనకు సరితూగే మరో నాయకుడు తెలంగాణలోనే లేరు.. గులాబీ నేతలే కాదు.. చాలా మంది ఎన్నికల విశ్లేషకులు కూడా అలాగే అనుకున్నారు.
గులాబీ బాస్ కేసీఆర్.. ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా పోరాడారు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డానికి మూల కారకుడు.. ఆయన తెలంగాణ జాతి పిత.. ఆయనకు సరితూగే మరో నాయకుడు తెలంగాణలోనే లేరు.. గులాబీ నేతలే కాదు.. చాలా మంది ఎన్నికల విశ్లేషకులు కూడా అలాగే అనుకున్నారు. ప్రభుత్వం మీద పలు విషయాల్లో ఆగ్రహం ఉన్నా ప్రజలు ఓట్లు వేసేది మాత్రం గులాబీ పార్టీకే (BRS) అనుకున్నారు. కేసీఆర్ (KCR)ను ప్రజలు ఎంత తిట్టుకున్నా సరే.. ఓట్లు మాత్రం ఆయనకే అని అంచనా వేశారు. అయితే ఆ అంచనాలన్నీ తప్పాయి (Telangana Result). అదే గులుగుడు గులుగుడే.. గుద్దుడు గుద్దుడే అని బీఆర్ఎస్ అనుకుంది.
సీన్ కట్ చేస్తే..!
రేవంత్ (Revanth Reddy) సారథ్యంలో ఉరకలు వేసిన కాంగ్రెస్‌కు (Congress) పార్టీకి తెలంగాణ రాష్ట్ర ప్రజలు స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు. నిజానికి రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నా ప్రభుత్వ పెద్దలు కాస్త ఉదాసీనంగా వ్యవహరించారు. నిరుద్యోగం, పేపర్ లీకేజీ, అవినీతి, ప్రజలకు అందుబాటులో లేకపోవడం.. ఇలా వర్గాల వారీగా చాలా మంది ప్రజలు బీఆర్‌ఎస్‌తో ఇబ్బంది పడ్డారు. గులాబీ బాస్‌లు హైదరాబాద్ మీద తప్ప ఇతర ప్రాంతాల మీద ఫోకస్ పెట్టడం లేదని గ్రామీణ ప్రాంతాల్లో ఎప్పట్నుంచో అసంతృప్తి ఉంది. అందుకు తగ్గట్టే ప్రస్తుత ఎన్నికల్లో గ్రామీణ ప్రాంత ప్రజలు తమ తీర్పు వెల్లడించారు.
Telangana Results: పీకేను వదులుకుని కేసీఆర్ తప్పు చేశారా? ఆయన ఉండుంటే బీఆర్‌ఎస్ గెలిచేదా?
నిత్యం ప్రజల్లో ఉంటూ కాంగ్రెస్ అంచెలంచెలుగా ఎదుగుతున్నా సరే కేసీఆర్ పట్టించుకోలేదు. రేవంత్ అండ్ కోకు అంత సీన్ లేదని తక్కువ అంచనా వేశారు. మెజారీటీకి కావాల్సిన సీట్లు ఏ మాత్రం తగ్గినా.. ఎంఐఎం, బీజేపీ సర్దుతాయని అనుకున్నారు. అయితే కేసీఆర్ అంచనాలన్నింటినీ తెలంగాణ ప్రజలు తల్లకిందులు చేశారు. కాంగ్రెస్‌కు వేరెవరిపైనా ఆధారపడాల్సిన అవసరం కల్పించలేదు. మొత్తానికి గులాబీ నేతల అతి విశ్వాసమే ఈ ఎన్నికల్లో వారి కొంప ముంచిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.