సరికొత్త డిజైన్లలో బతుకమ్మ చీరలు

ABN , First Publish Date - 2023-06-16T00:18:19+05:30 IST

బతుకమ్మ చీరలను సరికొత్త డిజైన్లలో తయారు చేస్తున్నట్లు, ఈ ఏడాది నిర్ణీత సమయంలో జిల్లాలకు సరఫరా చేయనున్నట్లు తెలంగాణ పవర్‌లూం టెక్స్‌టైల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌ అన్నారు.

సరికొత్త డిజైన్లలో బతుకమ్మ చీరలు
చీరలను పరిశీలిస్తున్న ప్రజాప్రతినిధులు, యజమానులు

సిరిసిల్ల రూరల్‌, జూన్‌ 15: బతుకమ్మ చీరలను సరికొత్త డిజైన్లలో తయారు చేస్తున్నట్లు, ఈ ఏడాది నిర్ణీత సమయంలో జిల్లాలకు సరఫరా చేయనున్నట్లు తెలంగాణ పవర్‌లూం టెక్స్‌టైల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌ అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని బతుకమ్మ చీరల గోదాములో చేనేత జౌళి శాఖ, టెస్కొ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ చీరల కొనుగోలు కేం ద్రాన్ని స్థానిక మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ జిందం కళాచక్రపాణితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిరి సిల్లలో 25 రకాల డిజైన్లు వివిధ రంగుల్లో తయారు చేసిన చీరలను పరిశీలించారు. అనం తరం ఆయన మాట్లాడుతూ సిరిసిల్లలో మర మగ్గాల కార్మికుల ఆత్మహత్యలను నివారిం చేం దుకు సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ 2017లో బతుకమ్మ చీరల తయారీని ప్రారంభిం చారని, కార్మికులకుఉపాధి కల్పించడంతోపాటు రాష్ట్రంలో ఉన్న కోటి మంది మహిళలకు బతుకమ్మ పండుగకు కానుకగా చీరలను అందిస్తున్నారని అన్నారు. 2017 నుంచి ఈ సంవత్సరం వరకు ఆరుసార్లు బతుకమ్మ చీరలను తయారు చేసి విజయవంతంగా పంపిణీ చేశామన్నారు. ఈ ఏడాది బతుకమ్మ చీరలను 25 రంగులు, వివిధ డిజైన్లతో తయారు చేయిస్తున్నామని, సెప్టెంబరులోగా రాష్ట్రంలోని 33 జిల్లాల కలెక్టరేట్‌ పరిధిలో పంపిణీకి ఏర్పాట్లు చేయడంలో భాగంగానే కొనుగోలు కేం ద్రాన్ని ప్రారంభించామని అన్నారు. మహి ళలకు నచ్చిన విధంగా మరింత నాణ్యత ప్రమాణాలతో కూడిన డిజైన్లతో చీరలను తయారు చేయాలని సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ పిలుపు మేరకు వచ్చే సంవత్సరం మరిన్ని డిజైన్లతో చీరలను తయారు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నా మన్నారు. బతుకమ్మ చీరల తయారీతో కార్మికులకు ప్రతి నెలా రూ.18 వేల నుంచి రూ.20 వేల వరకు ఆదాయం వస్తోందన్నారు. బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు జిం దం చక్రపాణి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, సెస్‌ డైరెక్టర్‌ దార్నం లక్ష్మీనారాయణ, చేనేత జౌళి శాఖ ఏడీ మిట్టకోల సాగర్‌, పాలిస్టర్‌ అసోసి యేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు మండల సత్యం, వెల్దండి దేవదాస్‌, ఎస్‌ఎస్‌ఐ, మ్యాక్స్‌ సంఘాల యజమానులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-16T00:18:19+05:30 IST