బీఆర్‌ఎస్‌ పథకాలకు ఆకర్షితులవుతున్నారు

ABN , First Publish Date - 2023-09-21T00:35:21+05:30 IST

బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టి అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలకు ప్రజాప్రతినిధులు, ప్రజలు ఆకర్షితులవుతున్నారని రా ష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు.

బీఆర్‌ఎస్‌ పథకాలకు ఆకర్షితులవుతున్నారు
మాట్లాడుతున్న వినోద్‌కుమార్‌

ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌

కొడిమ్యాల, సెప్టెంబరు 20 : బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టి అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలకు ప్రజాప్రతినిధులు, ప్రజలు ఆకర్షితులవుతున్నారని రా ష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినిపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. బుధ వారం మండల కేంద్రంలోని అక్షయ గార్డెన్‌లో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్య కర్తలు చేరే కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్బంగా వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ తెలంగాణ సర్కార్‌ ప్రవేశపెట్టి అ మలు పరుస్తున్న సంక్షేమ పథకాలకు కొడిమ్యాల గ్రామ సర్పంచు ఏలేటి మ మతనర్సింహారెడ్డ్డి, ఉప సర్పంచు శ్రీనివాస్‌, పూడూర్‌, చెప్యాల, గ్రామాల ఉప సర్పంచులు బండ లింగారెడ్డ్డి, ఎల్లయ్యలతో పాటు పలు గ్రామాలకు చెందిన సు మారు 800 మంది బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారన్నారు. తెలంగాణకు మూడవ సా రి కేసీఆర్‌ను సీఎం చేయాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్‌ పార్టీ మెనీఫెస్టోలో కొత్త పథకం ఏదీ లేదన్నారు. కేసీఆర్‌ పథకాలనే కాంగ్రెస్‌ మెనీఫెస్టోలో చేర్చా రన్నారు. పోతారం పెద్ద చెరువు నుంచి జేఎన్‌టీయూ వరకు, మైసమ్మ చెరువు కాల్వల పనులను పూర్తి చేయటానికి కృషి చేస్తామన్నారు. రవిశంకర్‌కు మరోసా రి ఆశీర్వదించి అసెంబ్లీకి పంపాలని కోరారు. అంతక ముందు ఎమ్మెల్యే రవిశంక ర్‌ మాట్లాడుతూ తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి ఆ దర్శంగా నిలిచాయన్నారు. చొప్పదండి నియోజకవర్గాన్ని 1700 కోట్ల రూపాయ లతో అభివృద్ధి చేశానన్నారు. రెండవ సారి ఓటు వేసి గెలిపించాలని రెట్టింపు ని ధులతో మరింత అభివృద్ధి చేస్తానన్నారు. అంతక ముందు మండలంలోని పూ డూర్‌ గ్రామ శివారు నుంచి బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ డ్పీ చైర్‌ పర్సన్‌ దావ వసంత, ఎంపీపీ స్వర్ణలత, జడ్పీటీసీ ప్రశాంతి, సర్పం చు ల ఫోరం మండల అధ్యక్షుడు కృష్ణారావు, కొడిమ్యాల, పూడూర్‌, తిర్మాలాపూర్‌ సింగిల్‌ విండో చైర్మనులు రాజనర్సింగరావు, రవీందర్‌రెడ్డ్డి, రాజేందర్‌, మార్కెట్‌ కమటీ చైర్మన్‌ నరందర్‌రెడ్డ్డి, ఉపాధ్యక్షుడు ప్రసాద్‌, బీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేష్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-09-21T00:35:21+05:30 IST