విశ్వాసమా.. అవిశ్వాసమా...?

ABN , First Publish Date - 2023-01-23T00:34:19+05:30 IST

గ్రేడ్‌ వన్‌ మున్సిపాలిటీగా పేరున్న జగిత్యాల బల్దియాలో కొత్త పంచాయితీ తెరమీదికొచ్చింది.

విశ్వాసమా.. అవిశ్వాసమా...?

జగిత్యాల టౌన్‌, జనవరి 22 : గ్రేడ్‌ వన్‌ మున్సిపాలిటీగా పేరున్న జగిత్యాల బల్దియాలో కొత్త పంచాయితీ తెరమీదికొచ్చింది. మున్సిపల్‌ ఏ ర్పడిన నాటి నుంచి తొలిసారి చైర్మన్‌ పదవి దక్కించుకున్న అధికార బీ ఆర్‌ఎస్‌ పార్టీలో అప్పుడే ముసలం మొదలైంది. చైర్‌ పర్సన్‌ను పదవీ నుంచి తప్పించాలని కొంత మంది కౌన్సిలర్లు ఏకమై సంతకాల సేకరణతో అవిశ్వాస తీర్మాణానికి తెరలేపారు. మూడేళ్ల పదవి పూర్తికి ఇంకా కొన్ని రోజులు గడువుకు ముందే నువ్వా, నేనా అన్నట్లుగా ఆదిపత్య పోరు కొన సాగుతోంది. అభివృద్ధిపై ఆలోచించాల్సిన అధికార పక్ష కౌన్సిలర్లు పదవు ల కోసం పాకులాడుతూ పార్టీ పరువును బజారుకీడుస్తాన్నారనే ఆరోపణ లు వెల్లువెత్తుతున్నాయి. విశ్వాసమా....అవిశ్వాసమా అన్నా పంచాయితీ ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ వద్దకు చేరింది. నిన్న మొన్నటి దాకా డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, నూతన మాస్టార్‌ ప్లాన్‌ను రద్దు చే యాలని రైతుల ఆందోళనతో ఇబ్బందులు పడ్డ ఎమ్మెల్యేకు ఇప్పుడు జగి త్యాల బల్దియా చైర్‌ పర్సన్‌ పదవికి తెరలేపిన అవిశ్వాస తీర్మానం తల నొప్పిగా మారిందనే చెప్పవచ్చు. మూడేళ్ల పదవీ కాలం ఈ నెల 27న ముగుస్తుండడంతో కొంత మంది ఆశావాహులు చైర్‌ పర్సన్‌ పదవీ కోసం పావులు కదుపడం ప్రారంభించారు. చైర్‌ పర్సన్‌కు వ్యతిరేకంగా సంతకా ల సేకరణ చేసి ఎమ్మెల్యేను కలిసిన కౌన్సిలర్లును కలుపుకుని ఆదివారం కొందరు విందుకు తెరలేపడంతో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయ నే వాదనలు వినిపిస్తున్నాయి.

బల్దియాలో ఆది నుంచి ఆధిపత్య పోరు...?

జగిత్యాల బల్దియాలో చైర్‌ పర్సన్‌ బోగ శ్రావణి, వైస్‌ చైర్మన్‌ గోళి శ్రీని వాస్‌తో పాటు మరి కొంత మంది కౌన్సిలర్లకు మధ్య ఆధినుంచే ఆధిపత్య పోరు నడుస్తుందనే ఆరోపణలు ఇటీవల కాలంలో మరింత ఎక్కువయ్యా యనే వాదనలు ఉన్నాయి. దీంతో పాలక వర్గంలోని కొందరు కౌన్సిలర్లు రెండు గ్రూపులుగా విడిపోయి చిన్న చిన్న విందులు, విహార యాత్రలు తెరలేపారు. అంతేకాకుంగా గతంలో పట్టణంలోని 2వ, వార్డులో డ్రైనేజీ నిర్మాణ పనులను కావాలనే ఆపించారంటూ చైర్‌ పర్సన్‌ బోగ శ్రావణిపై అధికార పార్టికి చెందిన రెండవ వార్డు కౌన్సిలర్‌ బద్దం లత ఏకంగా అ ప్పటి కమిషనర్‌ గంగాధర్‌కు ఫిర్యాదు చేసింది. ఇదే డ్రైనేజీ నిర్మాణ విష యంలో 17వ, వార్డు కౌన్సిలర్‌ సిరికొండ పధ్మ సైతం డ్రైనేజీ నిర్మాణం చే యవద్దంటూ చైర్‌ పర్సన్‌ శ్రావణికి మద్దతుగా పిర్యాదు చేశారు. దీంతో పాటు బల్దియాలో రెండు, పక్క పక్కన ఉన్న వార్డుల కౌన్సిలర్లు సైతం ఇదే తరహాలో హద్దులపై ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకోవడం అప్ప ట్లో చర్చకు దారితీసింది. ఇపుడు ఏకంగా చైర్‌ పర్సన్‌ను పదవి నుంచి త ప్పించాలని కోరుతూ 26 మంది కౌన్సిలర్లు సంతకాల సేకరణ చేపట్టడం అవిశ్వాస రాజకీయాలకు తెరలేపిందని చెప్పవచ్చు.

విందు రాజకీయాలకు తెరలేపిన ఆశావహులు..

జగిత్యాల బల్దియాలో 48 వార్డులు ఉండగా 30 మంది అధికార బీఆర్‌ ఎస్‌, ఏడుగురు కాంగ్రెస్‌, ముగ్గురు బీజేపీ, ఒక్కొక్కరు ఏఎంఐఎం, ఏఐ ఎఫ్‌బీ పార్టీలకు చెందిన కౌన్సిలర్లు, 06 గురు ఇండిపెండెంట్లు విజయం సాధించారు. మారిన రాజకీయ పరిణామాలతో ఆరవ వార్డునుంచికాం గ్రెస్‌ అభ్యర్థిగా విజయం సాదించిన కొలగాని ప్రేమలతో బీఆర్‌ఎస్‌లో చేరాగా ఐదవ వార్డు కౌన్సిలర్‌ గుగ్గిల్ల హరీష్‌, ఏడవ వార్డు కౌన్సిలర్‌ వ ల్లెపు రేణుక, 16 వార్డు కౌన్సిలర్‌ కూతురు రాజేష్‌, 47వ వార్డు కౌన్సిలర్‌ షేక్‌ చాంద్‌ పాష, 26వ వార్డు కౌన్సిలర్‌ అస్మా అంజుమ్‌లు ఇండిపెండెం ట్‌లుగా, ఏఐఎఫ్‌బీ నుంచి 8వ, వార్డు కౌన్సిలర్‌గా విజయం సాధించిన వానరాసి మల్లవ్వ, 27వ వార్డు ఏఎంఐఎం కౌన్సిలర్‌ రజియోద్దీన్‌ల మ ద్దతుతో 37వ వార్డు కౌన్సిలర్‌ బోగ శ్రావణి చైర్‌ పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఇప్పుడు అవిశాస్వసం తెరపైకి రావడంతో చైర్‌ పర్సన్‌ పదవిని ఆశిస్తూ గతంలో బంగపడ్డ ఓ ముగ్గురు కౌన్సిలర్లతో పాటు మరో ఇద్దరు తెరపైకి వచ్చి తాజాగా విందు పార్టీలు ఇస్తూ క్యాంపు రాజకీయలాకు తెరలేపారు.

ఎమ్మెల్యే వద్దకు చేరిన పంచాయితీ...

జగిత్యాల బల్దియాలో కౌన్సిలర్ల మధ్య విభేదాలు, గ్రూపు రాజకీయాల పంచాయితీ ఇపుడు ఎమ్మెల్యే వద్దకు చేరింది. చైర్‌ పర్సన్‌కు వ్యతిరేకంగా సంతకాలు చేసిన కౌన్సిలర్లు మాత్రం మూడేళ్ల పదవి కాలం ముగిసిన వెంటనే అవిశ్వాసం పెట్టాలని ఎమ్మెల్యేను సైతం డిమాండ్‌ చేసినట్లు సమాచారం. జగిత్యాల మున్సిపాలిటీకి 2020 జనవరి 22 ఎన్నికలు జరుగ గా, 25న ఫలితాలు, 27న నూతన పాలక వర్గం ప్రమాణం స్వీకారం చే శారు. మూడేళ్ల క్రితం సరిగ్గా ఎన్నికలు జరిగిన రోజునే ఎంచుకుని ఇప్పు డు కొందరు కౌన్సిలర్లు ఏకమై అవిశ్వాస తీర్మానానికి పక్కగా ప్లాన్‌ చేశా రని అధికార బీఆర్‌ఎస్‌ నాయకులే కొందరు బహిరంగంగా ఆరోపిస్తున్నా రు. నిన్న మొన్నటిదాకా డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక, మా స్టర్‌ ప్లాన్‌కు వ్యతిరేఖంగా రైతుల ఆందోళనలను తిప్పికొట్టేలా వ్యవహిం చిన ఎమ్మెల్యేకు జగిత్యాల బల్దియా వ్యవహారం నెత్తిన మరో పిడుగులా పడింది. ఈ వ్యవహారాన్ని జగిత్యాలకు రాజకీయంగా పెద్ద దిక్కుగా వ్య వహరించే నిజామాబాద్‌ మాజీ ఎంపీ, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకవెళుతారా, లేకా ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ ఒంటిరిగానే పరిష్కరిస్తారనే అనే ప్రశ్నలు తెరమీదికి వస్తున్నాయి.

Updated Date - 2023-01-23T00:34:23+05:30 IST