బద్ది పోచమ్మ ఆలయంలో బోనాల జాతర
ABN , Publish Date - Dec 27 , 2023 | 12:06 AM
రాజరాజేశ్వరస్వామివారి అనుబంధ దేవాలయమైన బద్ది పోచమ్మ ఆలయం మంగళవారం భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో జాతరను తలపించింది.
వేములవాడ, డిసెంబరు 26 : రాజరాజేశ్వరస్వామివారి అనుబంధ దేవాలయమైన బద్ది పోచమ్మ ఆలయం మంగళవారం భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో జాతరను తలపించింది. మేడారం సమ్మక్క సారక్క జాతర సమీపిస్తుండడం, వరుస సెలవులు రావడంతో వేములవాడలో భక్తుల సంఖ్య పెరిగింది. ఈ క్రమంలో సోమవారం తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు ఆనవాయితీ ప్రకారం మంగళవారం బద్ది పోచమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. బద్ది పోచమ్మ అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.