ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు

ABN , First Publish Date - 2023-04-07T00:49:07+05:30 IST

వేములవాడ మండలం అగ్రహారం జోడాంజనేయ స్వామివారి ఆలయంలో గురువా రం హనుమాన్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిం చారు.

ఘనంగా హనుమాన్‌ జయంతి వేడుకలు
స్వామివారి రథోత్సవంలో పాల్గొన్న భక్తులు

- భారీగా తరలివచ్చిన భక్తులు

వేములవాడ టౌన్‌, ఏప్రిల్‌ 6: వేములవాడ మండలం అగ్రహారం జోడాంజనేయ స్వామివారి ఆలయంలో గురువా రం హనుమాన్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిం చారు. ఆలయన అర్చకులు ఉదయం నాలుగు గంటలకు సుప్రభాతం, 4.30 గంటలకు సంకల్పం, అభిషేకం, హారతి, మంత్రపుష్పము, తీర్థప్రసాద వితరణ, 5.30 గంటలకు అభిషేక పూజ, ఉదయం ఎనిమిది గంటలకు శ్రీవారి జెండా ఎత్తుట, 9.30 గంటలకు ఉత్సవ మూర్తులకు అభిఫేకం అనంతరం నిత్యహవనం, పూర్ణాహుతి నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు అంజన్న భక్తులకు మాలదారణ స్వాములకు అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. సా యంత్రం 4.30 గంటలకు వైభవంగా రథోత్సవం నిర్వహిం చారు. స్వామివారి రథోత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఫ అంజన్నను దర్శించుకున్న ప్రముఖులు..

హనుమాన్‌ జయంతిని పురష్కరించుకుని అగ్రహారం జోడాంజనేయ స్వామివారిని ఎమ్మెల్యే రమేష్‌బాబు, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్‌, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఏనుగు మనోహర్‌రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు.

Updated Date - 2023-04-07T00:49:07+05:30 IST