ఘనంగా కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి

ABN , First Publish Date - 2023-09-27T23:16:21+05:30 IST

ప్రత్యేక రాష్ట్ర సాధనకు అవిరళ కృషి చేసిన అలుపెరగని పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ అని జిల్లా కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ అన్నారు.

ఘనంగా కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి

పెద్దపల్లి కల్చరల్‌, సెప్టెంబరు 27 : ప్రత్యేక రాష్ట్ర సాధనకు అవిరళ కృషి చేసిన అలుపెరగని పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ అని జిల్లా కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ అన్నారు. బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆచార్య కొండా లక్ష్మణ్‌ బాపూజీ జయంతి వేడుకల్లో కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం కొండా లక్ష్మణ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జిల్లా కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్‌ మాట్లాడుతూ కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఆశయా లను నెరవేర్చాలని అన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ కొండా లక్ష్మణ్‌ బాపూజీ సామాజిక అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జే.అరు ణశ్రీ, శ్యాం ప్రసాద్‌లాల్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రఘువీర్‌సింగ్‌, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల రామ్మూర్తి, వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి రంగారెడ్డితదితరులు పాల్గొన్నారు. కాగా, ఉష స్ఫూర్తి మానసిక దివ్యాంగుల పునరావాసంలో బీఎస్పీ పెద్దపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరి జయంతి వేడుకలు నిర్వహిం చారు. లక్ష్మణ్‌ బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి దివ్యంగులకు పండ్లు, బిస్కెట్స్‌, 5వేల రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ అసెంబ్లీ కోశాధికారి ఎండి రియాజ్‌, అసెంబ్లీ మహిళా కన్వీనర్‌ అముదల అరుణ, అసెంబ్లీ మహిళా కన్వీనర్‌ దేశబోయిన అఖిల, గోలి శ్రీనివాస్‌, చిన్న మల్లేశం, వరలక్ష్మి, దాసరి కిషన్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-27T23:16:21+05:30 IST