కరీంనగర్ జిల్లాలో కలకలం.. పెళ్లైన కొద్దిసేపటికే నవ వధువు కిడ్నాప్
ABN , First Publish Date - 2023-05-25T12:34:04+05:30 IST
హుజురాబాద్ పట్టణంలో నవ వధువు కిడ్నాప్ కలకలం రేపుతోంది. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో సినీ ఫక్కీలో వధువు అపహరణకు గురైంది
కరీంనగర్: హుజురాబాద్ పట్టణంలో నవ వధువు కిడ్నాప్ కలకలం రేపుతోంది. పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో సినీ ఫక్కీలో వధువు అపహరణకు గురైంది. కారులో వచ్చిన దుండగులు వరుడిని చితకబాది యువతిని ఎత్తుకెళ్లిపోయారు.
హనుమకొండ జిల్లా మడికొండ గ్రామానికి చెందిన అమ్మాయి.. వరంగల్‌కు చెందిన అబ్బాయి ప్రేమించుకున్నారు. వీరిద్దరూ కొండగట్టులో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి చేసుకుని ఇంటికి వెళ్తుండగా.. కారులో వచ్చిన కొంత మంది వారిని అడ్డగించారు. అనంతరం అబ్బాయిని చితకబాది అమ్మాయిని ఎత్తుకెళ్లిపోయారు. అయితే ఈ కిడ్నాప్‌పై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని హుజురాబాద్ పోలీసులు తెలిపారు.