బడుగు, బలహీన వర్గాల నాయకుడు కొమిరెడ్డి రాములు

ABN , First Publish Date - 2023-04-17T00:46:51+05:30 IST

ప్రజా రాజకీయాల్లో చురుకైన నాయకుడుగా బడుగు బల హీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసిన వ్యక్తి, సుప్రీంకోర్టు న్యాయవాది, మెట్‌పల్లి మాజీ ఎమ్మెల్యే, ఫ్లోర్‌ లీడర్‌ కొమిరెడ్డి రాములు అని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షు డు పొన్నాల లక్ష్మయ్య, తెలంగాణ స్టేట్‌ ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌, మాజీ మంత్రి గొడిసెల రాజేశంగౌడ్‌, మాజీ ఎంపీలు మధుయాష్కిగౌడ్‌, పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ అన్నారు.

బడుగు, బలహీన వర్గాల నాయకుడు కొమిరెడ్డి రాములు
కొమిరెడ్డి రాములు చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి,

- ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య

మెట్‌పల్లి రూరల్‌, ఏప్రిల్‌ 16 : ప్రజా రాజకీయాల్లో చురుకైన నాయకుడుగా బడుగు బల హీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేసిన వ్యక్తి, సుప్రీంకోర్టు న్యాయవాది, మెట్‌పల్లి మాజీ ఎమ్మెల్యే, ఫ్లోర్‌ లీడర్‌ కొమిరెడ్డి రాములు అని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షు డు పొన్నాల లక్ష్మయ్య, తెలంగాణ స్టేట్‌ ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌, మాజీ మంత్రి గొడిసెల రాజేశంగౌడ్‌, మాజీ ఎంపీలు మధుయాష్కిగౌడ్‌, పొన్నం ప్రభాకర్‌గౌడ్‌ అన్నారు. ఆదివారం మండలంలోని వెల్లుల్ల గ్రామ శివారులోని వీఆర్‌ఎమ్‌ గార్డెన్‌లో కొమిరెడ్డి రాములు ద్వాదశ దినకర్మ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు మాజీ ఎమ్మెల్యే కొమిరెడ్డి జ్యోతి, తనయులు కొమిరెడ్డి కరంచంద్‌, విజయ్‌అజాద్‌, కపిల్‌ నిర్వహించారు. రాములు చిత్రపటానికి పూలవేసి నివాళుల ర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొమిరెడ్డి రాములు విద్యా ర్థి నాయకుడి దశ నుంచిఉమ్మడి రాష్ట్రంలో రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నాడన్నారు. మెట్‌ పల్లి ఎమ్మెల్యేగా గెలుపొంది బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, ఈ ప్రాంత అభివృద్ధికి ఎం తగానో కృషి చేసిన కొమిరెడ్డి రాములు మృతి చెందడం బాధాకరమని అన్నారు. బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌కుమార్‌ పాల్గొని రాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నియోజక వర్గం ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు, జువ్వాడి కృష్ణరావు, కాటిపల్లి శ్రీనివాస్‌రెడ్డి, గడ్డం లక్‌పతిరెడ్డి, మారు శ్రీనివాస్‌రె డ్డి, రాజ్‌కుమార్‌, రాజేశ్వర్‌రెడ్డి, మిట్టపల్లి మహేందర్‌రెడ్డి, నాయకులు, అభిమానులు, కార్యకర్త లు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు పాల్గొన్నారు.

Updated Date - 2023-04-17T00:46:51+05:30 IST