మున్నూరు కాపు కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2023-02-05T00:19:14+05:30 IST

మున్నూరు కాపుల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య డిమాండ్‌ చేశారు.

మున్నూరు కాపు కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలి
మాట్లాడుతున్న మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య

పెద్దపల్లి టౌన్‌, ఫిబ్రవరి 4: మున్నూరు కాపుల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో శనివారం సంఘం జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చల్లా హరిశంకర్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎల్‌ రాజయ్య, యూత్‌ స్టేట్‌ కన్వీనర్‌ ఆకుల వివేక్‌ స్వామి పటేల్‌ ముఖ్య అథితులగా హాజరయ్యారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా మున్నూరు కాపులు ఐక్యమయ్యేలా సింహ గర్జన నిర్వహించనున్నామని అన్నారు. అనంతరం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా పాలకుర్తి మండలం కన్నాల గ్రామానికి చెందిన సింగిల్‌ విండో మాజీ చైర్మన్‌ మల్క రామస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధాన కార్యదర్శిగా తూముల శ్రీనివాస్‌, జిల్లా కోశాధికారిగా వరాల సంపత్‌, గౌరవ అధ్యక్షులుగా అమిరిశెట్టి రామస్వామి, గాజుల రాజమల్లు, రైతు సంఘం అధ్యక్షుడిగా మల్క రాజేశంను ఎన్నుకున్నారు. కార్యక్రమం లో పెద్దపల్లి జడ్పీటీసీ బండారి రామ్మూర్తి, మంథని సింగిల్‌ విండో అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌, నూగిళ్ల మల్లయ్య, పలువురు ప్రజాప్రతిని ధులు, సంఘ సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-05T00:19:16+05:30 IST