ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన ముస్కాన్‌ బృందం

ABN , First Publish Date - 2023-05-04T00:31:21+05:30 IST

గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిని ఢిల్లీకి చెందిన ముస్కాన్‌ బృందం బుధవారం సందర్శించింది. డాక్టర్‌ వందన శైని, ముస్తాఫా యూనిస్‌ ఆసుపత్రిలోని నవజాత శిశు కేంద్రం, ఐటీ, లేబర్‌ రూమ్‌తో పాటు ఆసుపత్రి ఆవరణలోని పరిశుభ్రతను పరిశీలించారు.

ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన ముస్కాన్‌ బృందం
ఆసుపత్రిలో వార్డును పరిశీలిస్తున్న ముస్కాన్‌ బృందం

- నవజాత శిశు కేంద్రం, వార్డుల పరిశీలన

కళ్యాణ్‌నగర్‌, మే 3: గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిని ఢిల్లీకి చెందిన ముస్కాన్‌ బృందం బుధవారం సందర్శించింది. డాక్టర్‌ వందన శైని, ముస్తాఫా యూనిస్‌ ఆసుపత్రిలోని నవజాత శిశు కేంద్రం, ఐటీ, లేబర్‌ రూమ్‌తో పాటు ఆసుపత్రి ఆవరణలోని పరిశుభ్రతను పరిశీలించారు. ఈ ముస్కాన్‌ బృందం రాష్ట్రంలో ఉన్న జనరల్‌ ఆసుపత్రులను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలను గుర్తించి వారికి మూడు సంవత్సరాలు పాటు ప్రతి ఏటా మూడు లక్షల బహుమానాన్ని ఇస్తారు. ఆసుపత్రిలో నవజాత శిశువు కేంద్రంలో పిల్లలకు అందుతున్న వైద్య సేవలు, ఐవీ, రిజిష్టర్లను, ప్రథమ చికిత్స తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. జనరల్‌ వార్డు, ప్రసూతి వార్డులను పరిశీలించారు. ప్రసూతి వార్డులో అందుతున్న వైద్యసేవలు, వార్డుల్లో శుభత్ర, మరుగుదొడ్ల నిర్వహణ తదితర పనులను వారు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ బృందం రెండు రోజుల పాటు పరిశీలించి వంద మార్కులు వస్తే మొదటి బహుమతి, ద్వితీయ, తృతీయ బహుమతులను ప్రకటించారు. ఇప్పటికే వారు కొన్ని వంద పడకల ఆసుపత్రుల్లో పరిశీలన జరిపారు. వారి వెంట వైద్యుల్‌ ఆదిష్‌రెడ్డి, శృతి, శ్రీలత, శిరీష, శ్రీజ తదితరులు ఉన్నారు.

Updated Date - 2023-05-04T00:31:21+05:30 IST