పంచాయతీ పెండింగ్‌ బిల్లుల నిధులు విడుదల చేయాలి

ABN , First Publish Date - 2023-05-08T01:05:49+05:30 IST

జిల్లాలోని పంచాయతీ సర్పంచ్‌లకు రావాల్సిన పెండింగ్‌ బిల్లుల నిధులు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

పంచాయతీ పెండింగ్‌ బిల్లుల నిధులు విడుదల చేయాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి

- ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌ రెడ్డి

జగిత్యాల టౌన్‌, మే 7: జిల్లాలోని పంచాయతీ సర్పంచ్‌లకు రావాల్సిన పెండింగ్‌ బిల్లుల నిధులు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆదివా రం పట్టణం లోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం నిధులు ఇవ్వ డం లేదని రాష్ట్రం, యుటిలై జేషన్‌ సర్టిఫికేట్‌ ఇవ్వడం లేదని కేంద్రం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటుండడం విడ్డూరంగా ఉందన్నా రు. సర్పంచ్‌ల హక్కులను పాలకులు కాలరాస్తున్నారని విమర్శించా రు. నిధులు విడుదల జాప్యంతో అప్పుల ఊబిలోకి సర్పంచ్‌లు వెళ్లి కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పలు పంచాయతీ ల్లో వచ్చిన కొద్దిపాటి నిధులను సైతం సర్పంచ్‌లకు తెలియకుండా డి జిటల్‌ కీలతో డ్రా చేస్తున్నారని ఆరోపించారు. సర్పంచ్‌లు బిల్లుల కో సం ఆత్మహత్యలు చేసుకోకముందే నిధులు మంజూరు చేయాలని డి మాండ్‌ చేశారు. అభివృద్ధి పనులు పూర్తి చేయడంతో పాటు బిల్లులు సమర్పించి నెలలు గడుస్తున్నా నిధులు మంజూరు చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ శాఖల కరెంటు బిల్లులు పెండింగ్‌లో పెడుతూ గ్రామ పంచాయతీలను ముక్కు పిండి వసూలు చేస్తున్నా రని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ స్పందించి సర్పంచ్‌లకు రావాల్సిన బిల్లులను ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. జగిత్యాలలో బలహీన వర్గాలకు రిజర్వ్‌ చేసిన ఎంపీపీ పదవిలో ఇతర వర్గం వారు అధికా రం చెలాయించడం నిరోదించాలన్నారు. రిజర్వేషన్లను గౌరవించి జగి త్యాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పదవిలో మహిళను కూర్చో బెట్టాలని హితవు పలికారు. ఈ సమావేశంలో నాయకులు గిరి నాగభూ ష ణం, బండ శంకర్‌, గాజంగి నందయ్య, కల్లెపల్లి దుర్గయ్య, జున్ను రాజేందర్‌, చాంద్‌పాషా, రమ్య లక్ష్మణ్‌, సరిత, భూమారెడ్డి, రాజేశ్‌, విజయ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-05-08T01:05:49+05:30 IST