పోచమ్మ బోనాలు

ABN , First Publish Date - 2023-05-27T00:29:41+05:30 IST

మండలంలోని పోరండ్లలో పోచమ్మ పునఃప్రతిష్ట జరిగి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం గ్రాస్థులందరూ పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు.

 పోచమ్మ బోనాలు
పోరండ్లలో పోచమ్మ బోనాలతో తరలి వెళుతున్న గ్రామస్ధులు

తిమ్మాపూర్‌, మే 26: మండలంలోని పోరండ్లలో పోచమ్మ పునఃప్రతిష్ట జరిగి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం గ్రాస్థులందరూ పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలు నెత్తిన పెట్టుకుని డప్పు చప్పుళ్ల మధ్య ముందుకు సాగారు. ఊరంత చల్లగా, పాడి పంటలు బాగుండాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని పోచమ్మ దేవతలకు మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు శేశాచారి, శ్రీధర చారీ గ్రామస్ధులు పాల్గొన్నారు.

Updated Date - 2023-05-27T00:29:41+05:30 IST