బదిలీల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలి
ABN , First Publish Date - 2023-01-22T00:42:00+05:30 IST
ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దోర్నాల భూపాల్‌రెడ్డి, దుమాల రమానాథ్‌రెడ్డి అన్నారు.
సిరిసిల్ల ఎడ్యుకేషన్, జనవరి 21: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దోర్నాల భూపాల్‌రెడ్డి, దుమాల రమానాథ్‌రెడ్డి అన్నారు. శనివారం సిరిసిల్లలోని జిల్లా విద్యాధికారి కార్యాలయంలో డీఈవో రాధాకిషన్‌కు టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కౌన్సెలింగ్ ప్రక్రియను ఆఫ్‌లైన్ పద్ధతిన నిర్వహించాలన్నారు. జీహెచ్‌ఎం పోస్ట్ కోసం ఇది వరకు దరఖాస్తు చేసి ఉన్న ఉన్నత పాఠశాలలకు పోస్ట్‌ను మంజూరు చేయాలని, పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని కోరారు. ముంపు గ్రామాల పాఠశాలల ఉపాధ్యాయుల స్టేషన్ సీనియారిటీని పాత స్టేషన్ లేదా కొత్త స్టేషన్ నుంచి లెక్కించేందుకు ఉపాధ్యాయులకే ఐచ్ఛికం ఇవ్వాలన్నారు. జీవో 317 బాధిత ఉపాధ్యాయుల సమలస్యను పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ గుజ్జునేని వేణుగోపాల్‌రావు, జిల్లా ఉపాధ్యక్షుడు సత్తు రవీందర్, కార్యదర్శి సూర భాస్కర్, నాయకులు బండి ఉపేందర్, పదిరే బాలాగౌడ్, దూడం మనోహర్ పాల్గొన్నారు.