ధర్మపురిలో వైభవంగా రథోత్సవాలు
ABN , First Publish Date - 2023-02-20T00:38:40+05:30 IST
ధర్మపురి శ్రీ అక్కపల్లి రాజ రాజేశ్వర స్వామి, శ్రీ రామ లింగేశ్వర స్వామి, జైనా, నేరెళ్లలో శ్రీ సాంబ శివుని రథోత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు.
ధర్మపురి, ఫిబ్రవరి 19: ధర్మపురి శ్రీ అక్కపల్లి రాజ రాజేశ్వర స్వామి, శ్రీ రామ లింగేశ్వర స్వామి, జైనా, నేరెళ్లలో శ్రీ సాంబ శివుని రథోత్సవాలు ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ వేద పారాయణదారు పాలెపు ప్రవీణ్‌శర్మ, ఆలయ అర్చకులు ద్యావళ్ల విశ్వనాథశర్మ ఆధ్వర్యంలో ఆయా ఆలయాల నుంచి శివ పార్వతుల ఉత్సవ మూర్తులను రథాలపై ఆశీనులు చేశారు. అనం తరం అక్కపల్లి ఆలయం నుంచి నంది విగ్రహ చౌరస్తా వరకు రథాన్ని ఊరేగించారు. శ్రీ రామ లింగేశ్వర స్వామి రథంతో పాటు జైనాలో శ్రీ సాంబ శివుని రథాన్ని, నేరెళ్ల శ్రీ సాంబ శివుని రథాన్ని ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించి రథోత్సవాలు జరిపారు. మహిహిళలు మంగళ హారతులతో స్వాగతం పలికారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని రథోత్సవ కార్యక్రమాన్ని తిలకించారు. అంత కు ముందు ఉదయం శ్రీ రామ లింగేశ్వర స్వామి ఆలయంలో శివ పార్వతుల కల్యాణం జరిపారు. ఈ సందర్భంగా శ్రీ అక్కపల్లి రాజ రాజేశ్వర స్వామి ఆలయం వద్ద ధర్మపురికి చెందిన చుక్క చిన్న నర్సయ్య కుటుంబ సభ్యులు అ న్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి మున్సిపల్ చైర్‌పర్సన్ సం గి సత్యమ్మ, వైస్‌చైర్మన్ ఇందారపు రామయ్య, ఆలయ ఈవో సంకటాల శ్రీనివా స్, రిటైర్డ్ ఎస్సీ మాదాసు రమేష్‌బాబు, సర్పంచులు, ఎంపీటీసీలు, బీజేపీ మం డల అధ్యక్షులు సంగెపు గంగారం పాల్గొన్నారు.