కొండగట్టులో సైట్‌ ప్లాన్‌ సర్వే

ABN , First Publish Date - 2023-03-02T00:47:16+05:30 IST

సీఎం కేసీఆర్‌ కొండగట్టు ఆంజనేయస్వామి దేవ స్థానం అభివృద్ధికి ప్రకటించినట్లుగానే వంద కోట్లు విడుదల చేయడం, స్వయంగా కొండగట్టుకు వచ్చి కేసీఆర్‌ అభివృద్ధి పనులు, ఆలయ పునర్ని ర్మాణంపై సమీక్ష నిర్వహించడంతో వివిధ శాఖల అధికారులు తమ సర్వే పనుల్లో నిమగ్నమయ్యారు.

 కొండగట్టులో సైట్‌ ప్లాన్‌ సర్వే
కొండగట్టు ఆలయం

ఫ సీఎం ఆదేశాలతో మాస్టర్‌ప్లాన్‌ తయారీకి వివరాల సేకరణ

ఫ పొజిషన్‌ సర్వే ఆధారంగా అభివృద్ధి పనులు

ఫ నీటి సరఫరాపై ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు

మల్యాల, మార్చి 1: సీఎం కేసీఆర్‌ కొండగట్టు ఆంజనేయస్వామి దేవ స్థానం అభివృద్ధికి ప్రకటించినట్లుగానే వంద కోట్లు విడుదల చేయడం, స్వయంగా కొండగట్టుకు వచ్చి కేసీఆర్‌ అభివృద్ధి పనులు, ఆలయ పునర్ని ర్మాణంపై సమీక్ష నిర్వహించడంతో వివిధ శాఖల అధికారులు తమ సర్వే పనుల్లో నిమగ్నమయ్యారు. కొండపైన మొత్తంగా సర్వే చేస్తున్నారు. యా దాద్రి పునర్నిర్మాణంలో పాటు పంచుకున్న సిబ్బందినే కొండగట్టుకు పం పించిన అధికారులు మాస్టర్‌ప్లాన్‌ తయారికి గాను సైట్‌ప్లాన్‌ సర్వే చేస్తు న్నారు. దీని ద్వారా కొండపైన ఏ మేర భూమి లభ్యతగా ఉంది.. ఎక్కడే మి అభివృద్ధి పనులు చేపట్టాల్లో నిర్ణయించడానికి గత వారం రోజులుగా బృందాలుగా కొండపైన సర్వే చేస్తున్నారు. పొజిషన్‌ సర్వే ఆధారంగా సీ ఎం సమక్షంలో మాస్టర్‌ప్లాన్‌ రుపొందించడం, అభివృద్ధి పనులు, ఆలయ పునర్నిర్మాణం చేయడంపై సమీక్షించి దానికనుగుణంగా ప్రత్యేక ప్రణాళి క ఖరారు చేయనున్నారు. మాస్టర్‌ప్లాన్‌ రూపకల్పన నేపథ్యంలో ఎలాం టి నిర్మాణాలు చేయకూడదని ఇప్పటికే దేవస్థానం అధికారులను ఆదే శించారు. యాదాద్రి తరహాలో కొన్ని వందల ఏళ్ల పాటు భక్తులకు ఇబ్బం దులు లేకుండా సౌకర్యాల కల్పనకు మాస్టర్‌ప్లాన్‌ రుపొందించనున్నారు. ఇందులో భాగంగానే రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూములు గుర్తిం చారు. వాటిని దేవస్థానానికి అప్పగించనున్నారు.

ఫ నీటి తరలింపుపై ప్రతిపాదనలు

సీఎం ఆదేశాలతో ఇరిగేషన్‌ అధికారులు కొండపైన సమృద్ధిగా నీటిని అందించడానకి గాను రుపొందించిన ప్రణాళిక ప్రతిపాదనలను ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించారు. వారం రోజుల క్రితం ఇరిగేషన్‌ సీఈ తదితరు లు వచ్చి పరిశీలించి వెళ్లగా రూ. 13.50కోట్లతో కొండపైకి నీటిని తరలించే ప్రతిపాదనలు తయారు చేశారు. సంతోళ్లలొద్దికి సమీపంలో గల వరదకా లువ నుంచి లొద్దికి తరలించడం, చెక్‌డ్యామ్‌, ఫిల్టర్‌బెడ్‌ తదితర నిర్మాణా లు చేపట్టడం, అక్కడి నుంచి కొండపైకి నీటిని తీసుకురావడానికి ప్రతి పాదనలను పంపించారు. ఆలయ పునర్నిర్మాణానికి యాదాద్రి అర్కిటెక్‌ ఆనందసాయికి అప్పగించడంతో ఆ పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది.

Updated Date - 2023-03-02T00:47:16+05:30 IST