Share News

మసీదు నిర్మాణాన్ని అడ్డుకోండి

ABN , Publish Date - Dec 21 , 2023 | 12:32 AM

గోదావరిఖని ప్రధాన చౌరస్తాలోని పోచమ్మగుడి పక్కన సింగరేణి స్థలాన్ని ఆక్రమించి అనధికారికంగా నిర్మిస్తున్న మసీదు నిర్మాణాన్ని అడ్డుకోవాలని అడ్డుకోవాలని విశ్వహిందూ పరిషత్‌, బజరంగ్‌దళ్‌లు విజ్ఞప్తిచేశాయి.

మసీదు నిర్మాణాన్ని అడ్డుకోండి

కళ్యాణ్‌నగర్‌, డిసెంబరు 20: గోదావరిఖని ప్రధాన చౌరస్తాలోని పోచమ్మగుడి పక్కన సింగరేణి స్థలాన్ని ఆక్రమించి అనధికారికంగా నిర్మిస్తున్న మసీదు నిర్మాణాన్ని అడ్డుకోవాలని అడ్డుకోవాలని విశ్వహిందూ పరిషత్‌, బజరంగ్‌దళ్‌లు విజ్ఞప్తిచేశాయి. ఈ మేరకు బుధవా రం నగర కమిషనర్‌ నాగేశ్వర్‌, సింగరేణి జీ ఎంలకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సం దర్భంగా వీహెచ్‌పీ జిల్లా కార్యదర్శి అయోధ్య రవీందర్‌ మాట్లాడుతూ పోచమ్మ గుడి వెను కవైపు సింగరేణి స్థలంలో ఒక జెండా మాత్ర మే ఉండేదని,కానీ కొంతమంది స్థలాన్ని ఆక్రమించి చుట్టూ ప్రహారి నిర్మించి మసీదు నిర్మాణం పేరిట ప్రార్థనలు చేస్తున్నారన్నారు. 70ఏళ్లుగా పోచమ్మగుడి ఉందని తెలిసినప్పటి కీ రాబోయే ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని మత సామరస్యాన్ని దెబ్బతీసే చర్యకు పాల్పడ్డారన్నారు.పక్కనే మైసమ్మ గుడి, గణపతి మండపాలు ఉన్నాయన్నారు. మధ్యలో నిర్మి స్తున్న మసీదును తొలగించాలన్నారు. రామగుండంలో అక్ర మ నిర్మాణాల పేరిట గణపతి మండపాలు, దుర్గాదేవి మం డపాలను కూల్చివేస్తున్న నగర కమిషనర్‌ ఒక వర్గానికే కొ మ్ముకాస్తున్నాడన్నారు. సింగరేణి అధికారులు స్పందించి నగరం నడిబొడ్డున ఉన్నస్థలంలో ఆక్రమణలు తొలగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్‌ నాయ కులు మేడగోని నరవీందర్‌, ముష్కె సంపత్‌, అడిగొప్పుల రాజు, నేరేడుకొమ్మ వెంకటస్వామి, కొండపర్తి లింగన్న, ము నుగాల సంపత్‌, జలేందర్‌, ఆకాష్‌, శశి, శ్రావణ్‌ కుమార్‌, సుధీర్‌రాజు, యాది పాల్గొన్నారు.

Updated Date - Dec 21 , 2023 | 12:32 AM