నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దహనం
ABN , First Publish Date - 2023-01-02T23:39:54+05:30 IST
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డితో పాటు ముఖ్య నాయకుల అరెస్టులకు నిరసనగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను సోమవారం తెలంగాణ చౌక్ లో దహనం చేశారు.
గణేశ్‌నగర్, జనవరి 2 : పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డితో పాటు ముఖ్య నాయకుల అరెస్టులకు నిరసనగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను సోమవారం తెలంగాణ చౌక్ లో దహనం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గ్రామ పంచాయితీలకు ఇచ్చిన 35 వేల కోట్ల రూపాయల నిధులను దొంగ చాటుగా వేరే అకౌంట్లను బదిలీ చేసి గ్రామ పంచాయతీల పరిస్థితి ఆగమ్య గోచరంగా చేసిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నించినందుకు అరెస్టులు చేస్తారా ఆని ప్రశ్నించారు. ఏడు నెలలుగా గ్రామ పంచాయతీల మౌలిక సదుపాయాల కోసం స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా చెల్లించాల్సిన 250 కోట్ల రూపాయలు చెల్లించనందుకు నిరసనగా, ఇందిరా పార్క్ వద్ద పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, ముఖ్య నాయకులు చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని భగ్నం చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు.ఈ కార్య క్రమంలో సమద్ నవాబ్, శ్రవణ్ నాయక్, గుండాటీ శ్రీనివాస్ రెడ్డి, లింగంపల్లి బాబు, కుర్ర పోచయ్య, జీడీ రమేష్, దండి రవీందర్, దన్న సింగ్, ఎండి చాంద్, ఖమ్రొద్దిన్, పొరండ్ల రమేష్, షబానా, ముక్క భాస్కర్, కీర్తి కుమార్, కాంతయ్య, ఆమెర్, షేక్ షేహెన్ష, జాఫర్, అష్రాఫ్, సోహెల్, అనీఫ్, నాగరాజు, కమల్, అజ్మత్, సీరాజ్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.