ఆగమ శాస్త్ర నిబంధనలకు అనుగుణంగా పనులు

ABN , First Publish Date - 2023-01-13T00:37:12+05:30 IST

ఆగమశాస్త్ర నిబంధనలకు అనుగుణంగా ఆలయ విస్తరణ పనులు చేపట్టాలని దేవాదాయ శాఖ స్థపతి వల్లినాయగం అన్నారు.

ఆగమ శాస్త్ర నిబంధనలకు అనుగుణంగా పనులు
అధికారులతో చర్చిస్తున్న స్థపది, ఎస్‌ఈ

వేములవాడ, జనవరి 12: ఆగమశాస్త్ర నిబంధనలకు అనుగుణంగా ఆలయ విస్తరణ పనులు చేపట్టాలని దేవాదాయ శాఖ స్థపతి వల్లినాయగం అన్నారు. గురు వారం దేవాదాయ శాఖ ఎస్‌ఈ మల్లికార్జున్‌రెడ్డితో కలిసి బద్దిపోచమ్మ ఆలయాన్ని పరిశీలించారు. బద్ది పోచమ్మ ఆలయ విస్తరణ కోసం సేకరించిన స్థలంలో బోనాల మండపం, నాలుగు ప్రాకారాలు, క్యూలైన్లు ఆధునాతన పద్ధతులలో నిర్మించాలని సూచించారు. రాజరాజేశ్వరస్వామి ఆలయ గర్భగుడిలో రుద్రాక్ష మం డపం భక్తులు లోపలికి వెళ్లడానికి ఇబ్బందిగా ఉన్నం దున దాన్ని మార్చే విషయంలోనూ ప్రత్యామ్నాయ ఆలోచనలు చేయాలన్నారు.ఆలయ ఈ వో కృష్ణ ప్రసాద్‌, ఈఈ రాజేశ్‌, డీఈ రఘునందన్‌ ఉన్నారు.

Updated Date - 2023-01-13T00:37:19+05:30 IST