ప్రతిభను వెలికితీసేందుకు యువజనోత్సవాలు దోహదం
ABN , First Publish Date - 2023-01-04T23:53:10+05:30 IST
యువతీ, యువకులు ప్రతిభను ప్రద ర్శించేందుకు యవజనోత్సవాలు వేదిక గా నిలుస్తాయని జిల్లా ప్రజా పరిషత్, ఐర్మన్ పుట్ట మధుకర్ అన్నారు.
పెద్దపల్లి కల్చరల్, జనవరి 4 : యువతీ, యువకులు ప్రతిభను ప్రద ర్శించేందుకు యవజనోత్సవాలు వేదిక గా నిలుస్తాయని జిల్లా ప్రజా పరిషత్, ఐర్మన్ పుట్ట మధుకర్ అన్నారు. బుధ వారం స్థానిక అమర్‌చంద్ కల్యాణ మండపంలో యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లాస్థాయి యువజనోత్సవాలలో జిల్లా ప్రజా పరి షత్ చైర్మన్ పుట్ట మధుకర్ పాల్గొని వి జేతలకు బహుమతులు అందజేశారు. యువజనోత్సవాల్లో సాంస్కృతిక పోటీ లను ఉదయం పెద్దపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ దాసరి మమతారెడ్డి స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల లు వేసి జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. ఈ సంధర్బంగా జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ మాట్లాడుతూ ప్రతి ఏడా జనవరి 12న స్వామి వివేకానంద సేవలకు గుర్తుగా జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటు న్నామన్నారు. స్వామి వివేకానంద ఆశయ సాధనకు పాటు పడాలని తెలిపారు. మున్సిపల్ చైర్‌పర్సన్ దాసరి మమ తారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రీడాప్రాంగణాలను వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం వివిధ పోటీల్లో గెలుపొందిన వారికి జడ్పీ చైర్మన్ బహుమతులతో పాటు ప్రశంసపత్రాలు అందించా రు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్, జిల్లా యువజన, క్రీడల అధికారి తిరుపతిరావు, డీఈవో మాధవి, బీసీ సంక్షేమాధికారి రంగారావు, ఇంటర్ నోడల్ అధికారి కల్పన, అదనపు కలెక్టర్ సీసీ నర్సయ్య, న్యాయ నిర్ణేతలుగా ఉపాధ్యాయులు అనురాధ, సీతాభాయి తదితరులు పాల్గొన్నారు.