Kaushik Reddy: ఎట్టకేలకు గవర్నర్‌కు క్షమాపణ చెప్పిన కౌశిక్‌రెడ్డి
ABN , First Publish Date - 2023-02-21T19:18:55+05:30 IST
గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి (MLC Kaushik Reddy), జాతీయ మహిళా కమిషన్‌కు క్షమాపణ చెప్పారు. గవర్నర్ తమిళిసై ...
ఢిల్లీ: గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి (MLC Kaushik Reddy), జాతీయ మహిళా కమిషన్‌కు క్షమాపణ చెప్పారు. గవర్నర్ తమిళిసై (Governor Tamilisai)కి కూడా లేఖ ద్వారా క్షమాపణ చెబుతానని ప్రకటించారు. గవర్నర్ తమిళిసై పై అవమానకరమైన రీతిలో కౌశిక్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఆ వాఖ్యలను సుమోటోగా స్వీకరించి ఆయనకు కమిషన్ నోటీసులిచ్చింది. గవర్నర్‌పై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ రోజు (మంగళవారం) జరిగే విచారణకు హాజరై, వివరణ ఇవ్వాలని కౌశిక్‌రెడ్డికి నోటీసులు (Notices) జారీ చేసింది. కమిషన్ నోటీసులందుకున్న ఆయన ఈ రోజు ఢిల్లీలో మహిళా కమిషన్ ముందు హాజరయ్యారు. విచారణకు వచ్చిన కౌశిక్‌రెడ్డి క్షమాపణలు చెప్పడంతో కథ సుఖాంతమైంది.
ఆ మధ్య గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం అన్నట్లుగా తలబడ్డారు. ఈ క్రమంలోనే ఓ కార్యక్రమంలో పాల్గొన్న కౌశిక్‌రెడ్డి... గవర్నర్‌పై వివాదాస్పదవ్యాఖ్యలు చేశారు. పెండింగ్ బిల్లులపై గవర్నర్ వ్యహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. గవర్నర్ ఏ రాజ్యాంగాన్ని పాటిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో తీర్మానం చేసిన ఫైళ్లను గవర్నర్ తన దగ్గర పెట్టుకున్నారని, ఒక్క ఫైల్‌ను కూడా కదలనివ్వడం లేదని కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. దీనిపై ఈటల రాజేందర్ (Etala Rajender) సమాధానం చెప్పాలని కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. అప్పట్లో ఈ వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి. కౌశిక్‌రెడ్డి వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు.
గవర్నర్, ప్రభుత్వం మధ్య కుదిరిన సయోధ్య
ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాలకు ముందు తెలంగాణ ప్రభుత్వం, గవర్నన్ మధ్య ఉన్న అడ్డంకులు తొలిగిపోయాయి. వాస్తవానికి శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రసంగం చుట్టూ తొలుత వివాదాలు అలుముకున్న విషయం తెలిసిందే. గవర్నర్ ప్రసంగానికి చోటు లేకుండానే సమావేశాలు కానిచ్చేయాలని ప్రభుత్వం తొలుత నిర్ణయించగా, ఇందుకు కౌంటర్‌గా బడ్జెట్ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం తెలపకుండా ‘గవర్నర్ ప్రసంగం ఉందా?’ అంటూ రాజ్‌భవన్ నుంచి తిరుగు టపా వచ్చింది. ఈ క్రమంలో ఏకంగా గవర్నర్‌పై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. అయితే హైకోర్టు సూచనలతో.. గవర్నర్ ప్రసంగం ఉండాలనే అంశంపై ఇరుపక్షాల న్యాయవాదుల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. గవర్నర్ ప్రసంగానికి ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. అయితే హైకోర్టు సూచనలతో.. గవర్నర్ ప్రసంగం ఉండాలనే అంశంపై ఇరుపక్షాల న్యాయవాదుల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభాన్ని పురస్కరించుకొని గవర్నర్ ఉభయ సభలనుద్దేశించి చేసిన ప్రసంగం.. ఎటువంటి ఆరోపణలు, విమర్శలకు తావులేకుండా.. అసలు కేంద్ర ప్రభుత్వం ప్రస్తావనే లేకుండా సాగింది.